Road Accident: దుద్దుకూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ABN, Publish Date - Jan 02 , 2024 | 03:51 PM
Andhrapradesh: జిల్లాలోని దేవరపల్లి మండలం దుద్దుకూరు జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్‌లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టీగా కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
తూర్పుగోదావరి: జిల్లాలోని దేవరపల్లి మండలం దుద్దుకూరు జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్‌లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టీగా కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఇద్దరు ఘటనాస్థలిలోనే మృతి చెందగా.. మరో ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని దేవరపల్లి ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 19 నెలల గనిస్కా మృతి చెందింది. మిగిలిన వారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 02 , 2024 | 03:53 PM