ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రత్యర్థి ఓట్లే టార్గెట్టా..!

ABN, Publish Date - Mar 09 , 2024 | 01:51 AM

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకోసం ప్రత్యర్థి ఓటర్ల గుర్తింపుతో టార్గెట్‌ చేసేందుకు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

సీఆర్సీలో వైసీపీ సమావేశాలతో సర్వత్రా చర్చ

రావులపాలెం, మార్చి8: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకోసం ప్రత్యర్థి ఓటర్ల గుర్తింపుతో టార్గెట్‌ చేసేందుకు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రావులపాలెం సీఆర్సీ వేదికగా బూత్‌ కన్వీనర్లు, గృహాసారఽథులు, వలంటీర్లు ముఖ్యనాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్ల జాబితాలతో మల్లగుల్లాలు పడుతుండడంతో చర్చనీయాంశంగా మారింది. అక్కడ జరిగే కార్యక్రమంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం మాదిరిగా సమావేశం ఏర్పాటుచేసి ఓటర్ల లిస్టులతో 2019 ఎన్నికల్లో బూత్‌ వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ పార్టీకి ఎన్ని వచ్చాయనే అంశంపై నమోదు ప్రక్రియ చేపట్టినట్టు తెలుస్తోంది. మండలం యూనిట్‌గా ఏ మండలానికి ఆ మండలం పిలిపించి సమావేశం నిర్వ హించి వారికి విందు భోజనాలతో మర్యాదలు చేస్తున్నట్టు గుసగుసలాడుకుంటున్నారు. అదేవిధంగా నూతన జాబితాలో ఇతర దేశాలకు వెళ్లిన వాళ్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, వృద్ధులు, నడవలేక ఇంటి వద్దే ఉండిపోయే వారి వివరా లు నమోదు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఎన్నికల సమయంలో తనకు అనుకూలంగా పనిచేసే విధంగా అధికారులను తెచ్చుకున్నట్టు విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ సమావేశాలు నియోజకవర్గంలో హట్‌టాపిక్‌గా మారిం ది. అదేవిధంగా వీరికి నగదు బహుమతులు ఇచ్చినట్టు పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

Updated Date - Mar 09 , 2024 | 08:12 AM

Advertising
Advertising