ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anakapalli Dist.: టీఎన్‌టీయూసీ కార్మిక చైతన్య యాత్ర

ABN, Publish Date - Jan 10 , 2024 | 10:47 AM

అనకాపల్లి జిల్లా: రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుని వాటి పరిష్కార దిశగా కార్యాచరణ చేపట్టేందుకు రాష్ట్ర టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో టెక్కలి నుంచి కుప్పం వరకు తలపెట్టిన కార్మిక బస్సు చైతన్య యాత్ర బుధవారం కాకినాడ జిల్లాకు చేరుతుంది.

అనకాపల్లి జిల్లా: రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుని వాటి పరిష్కార దిశగా కార్యాచరణ చేపట్టేందుకు రాష్ట్ర టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో టెక్కలి నుంచి కుప్పం వరకు తలపెట్టిన కార్మిక బస్సు చైతన్య యాత్ర బుధవారం కాకినాడ జిల్లాకు చేరుతుంది. ఈరోజు పరవాడ అచ్యుతాపురం, మండలంలో టీఎన్‌టీయూసీ కార్మిక చైతన్య యాత్ర నిర్వహించనుంది.

కాగా టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు గదుల సాయిబాబు ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడలోని స్థానిక జగన్నాథపురంలో పోస్టర్‌ ఆవిష్కరణ నిర్వహించారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ వర్గాల కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుని టీడీపీ కార్మిక బస్సు చైతన్య యాత్రను తలపెట్టిందన్నారు. భవన నిర్మాణ కార్మికులు, అంగన్‌వాడీలు, మున్సి పల్‌ కార్మికులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం ఆందోళనలు చేస్తున్న పరిస్థితుల్లో వారందరికీ సంఘీభావం తెలిపి అండగా నిలవడం యాత్ర ముఖ్య ఉద్దేశ్యమన్నారు. మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, సిటీ నియోజక వర్గ పరిశీలకుడు నాగిడి నాగేశ్వరరావు, అమలాపురం తెలుగు మహిళాధ్యక్షురాలు పెచ్చేటి విజయలక్ష్మి, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్‌, నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్‌, తాతపూడి రామకృష్ణ, వొమ్మి బాలాజీ, పంతాడి రాజు తదిరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2024 | 10:47 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising