టీడీపీ, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
ABN, Publish Date - Feb 11 , 2024 | 11:51 PM
తుని రూరల్, ఫిబ్రవరి 11: టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు పర్యవేక్షణలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమాన్ని తునితో పాటుగా ఎస్.అన్నవరం పంచాయతీ శివారు రామకృష్ణ కాలనీలో ఆదివారం నిర్వహించి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలు అందజేశారు. దివ్య మాట్లాడుతూ రాష్ట్రం
తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య
తుని రూరల్, ఫిబ్రవరి 11: టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు పర్యవేక్షణలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమాన్ని తునితో పాటుగా ఎస్.అన్నవరం పంచాయతీ శివారు రామకృష్ణ కాలనీలో ఆదివారం నిర్వహించి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలు అందజేశారు. దివ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రా నున్నది టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వమేనని ప్రజలు ఆశలు,ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ, జనసేన పార్టీలు పని చేస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్, పోల్నాటి శేషగిరిరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సుర్ల లోవరాజు, ఎన్. సూరవరం మాజీ సర్పంచ్ చింతమనీడి నాగ సోమరాజు, అప్పల రమేష్, జక్కన రామానాయు డు, తమరాన రామకృష్ణ, తుని పట్టణ అధ్యక్షుడు యినిగంటి సత్యనారాయణ నాయకులు ఉన్నారు.
Updated Date - Feb 11 , 2024 | 11:51 PM