వైసీపీని తరమికొట్టేందుకు ప్రజలు సిద్ధం
ABN, Publish Date - Feb 26 , 2024 | 12:10 AM
కోటనందూరు, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో అవి నీతి వైసీపీ ప్రభుత్వాన్ని తరమికొట్టేందుకు ప్రజ లు సిద్ధంగా ఉన్నారని టీడీపీ తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. ఆది వారం ఎస్‌అర్‌పేట గ్రామంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం టీడీపీ మండలాధ్యక్షుడు గాడి రాజుబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భం గా దివ్య మాట్లాడుతూ వైసీపీ పాలనంతా దా చుకోవడం దోచుకోవడంగా తయారైయిందన్నా రు. తుని నియోజకవర్గంలో గెలిచి పూర్వవైభవం తీసుకొస్తామ
టీడీపీ తుని ఇన్‌చార్జి యనమల దివ్య
కోటనందూరు, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో అవి నీతి వైసీపీ ప్రభుత్వాన్ని తరమికొట్టేందుకు ప్రజ లు సిద్ధంగా ఉన్నారని టీడీపీ తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. ఆది వారం ఎస్‌అర్‌పేట గ్రామంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం టీడీపీ మండలాధ్యక్షుడు గాడి రాజుబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భం గా దివ్య మాట్లాడుతూ వైసీపీ పాలనంతా దా చుకోవడం దోచుకోవడంగా తయారైయిందన్నా రు. తుని నియోజకవర్గంలో గెలిచి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. తన తండ్రిని ఆదరించినట్టే తనని కూడ ఆదరించాలని కోరారు. నియోజకవర్గంలో అన్నిసమస్యలు పరిష్కరించి అబివృద్ధి పథకంలో నడిపిస్తామన్నారు. కార్యక్రమంలో యనమల శివరామకృష్ణన్, మోతుకూరి వెంకటేష్, డి.చిరీంజీవిరాజు, అంకంరెడ్డి రమేష్, అంకంరెడ్డి నానబ్బాయి, పోతల సూరిబాబు, సుర్ల సూరిబాబు, గుడివాడ తాతబాబు, గుడివాడ రాజు, లెక్కల భాస్కర్, బంటుపల్లి వెంకటేశ్వరరావు, షేక్‌నవాభ్‌జానీ తదితరులున్నారు.
రాజుపేటలో ప్రచారం...
తుని రూరల్, ఫిబ్రవరి 25: జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపుదామని తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. మండలంలోని రాజుపేట గ్రామంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ య నమల కృష్ణుడుతో కలిసి మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కరపత్రాలు అందజేసి రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని దివ్య కోరారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్, పోల్నాటి శేషగిరిరావు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, అప్పన రమేష్, కొచ్చెర్లపాటి అరవింద వర్మ, ఆవుగడ్డి వెంకటరమణ, చింతమనీడి నాగ సోమరాజు, కిల్లాడ అప్పారావు, పకుర్తి శ్రీను, గొల్లపల్లి రాంబాబు, గజ్జి రాంబాబు, గింజాల అప్పారావు, కిల్లాడి సత్యనారాయణ ఉన్నారు.
Updated Date - Feb 26 , 2024 | 12:10 AM