Pawan Kalyan: పిఠాపురం ప్రజలు 5 కోట్ల మందిని గెలిపించారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా..!
ABN, Publish Date - Jun 04 , 2024 | 07:48 PM
తాజాగా వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసే ప్రభంజనం సృష్టించింది. మొత్తం పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు.
తాజాగా వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసే ప్రభంజనం సృష్టించింది. మొత్తం పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు అభినందనలు తెలియజేశారు.
``పేద వాడి కష్టం చూసి రాజకీయాల్లోకి వచ్చా. డబ్బు, పేరు కోసం రాలేదు. 2019లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడినపుడు నా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. గెలుపోటములను సమానంగా తీసుకుంటా. నన్ను గెలిపించిన పిఠాపురం ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. మీరు పవన్ కల్యాణ్‌ను గెలిపించలేదు. 5 కోట్ల మంది ప్రజలను గెలిపించారు. తెలుగుదేశం నేత వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు. పోటీ చేసి గెలిచింది 21 సీట్లలోనే అయినా 175 సీట్లలో గెలిపిస్తే ఎంత బాధ్యతగా ఉండాలో అంతే బాధ్యతగా ఉంటాం. ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటాం`` అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడారు
Updated Date - Jun 04 , 2024 | 07:48 PM