ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘డయేరియా’ పరిస్థితిపై నివేదిక ఇవ్వండి!

ABN, Publish Date - Feb 20 , 2024 | 05:19 AM

గుంటూరు నగరంలో 15 రోజులుగా విజృంభిస్తున్న అతిసారం వాస్తవ పరిస్థితిపై నివేదిక అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. గుంటూరులో డయేరియాతో ఇప్పటి

గుంటూరు అతిసారం ఉదంతంపై హైకోర్టు ఆదేశం

జీజీహెచ్‌ను సందర్శించిన న్యాయాధికారి లీలావతి

గుంటూరు (మెడికల్‌), ఫిబ్రవరి 19: గుంటూరు నగరంలో 15 రోజులుగా విజృంభిస్తున్న అతిసారం వాస్తవ పరిస్థితిపై నివేదిక అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. గుంటూరులో డయేరియాతో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో వందలాది మంది చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం అడుగడుగునా గోప్యత పాటిస్తోంది. తాగునీటి నాణ్యతపై రీజనల్‌ ల్యాబ్‌ ఇచ్చిన నివేదికను సైతం వెల్లడించ లేదు. రోగుల సంఖ్యను కూడా తక్కువగా చూపుతున్నారు. దీంతో పత్రికల్లో వెలువడుతున్న వార్తలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై సమగ్ర నివేదికను అందజేయాలని గుంటూరు జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీని ఆదేశించింది. కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ కార ్యద ర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి టీ లీలావతి గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో డయేరియా వార్డును సందర్శించారు. అందుతున్న వైద్యసేవలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం న్యాయాధికారి లీలావతి, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వై కిరణ్‌కుమార్‌తో మాట్లాడారు.

Updated Date - Feb 20 , 2024 | 08:55 AM

Advertising
Advertising