AP News: నేడు మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం మరోసారి చర్చలు..
ABN, Publish Date - Jan 02 , 2024 | 07:59 AM
నేడు మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. తొలివిడత చర్చలు విఫలం కావడంతో మరోమారు చర్చలకు మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం ఆహ్వానించింది. కార్మిక సంఘాలతో మంత్రులు బుగ్గన, ఆదిమూలపు సురేష్ చర్చలు నిర్వహించనున్నారు.
అమరావతి: నేడు మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. తొలివిడత చర్చలు విఫలం కావడంతో మరోమారు చర్చలకు మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం ఆహ్వానించింది. కార్మిక సంఘాలతో మంత్రులు బుగ్గన, ఆదిమూలపు సురేష్ చర్చలు నిర్వహించనున్నారు. వారం రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. 13 డిమాండ్లతో పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు.
కాగా.. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమింపచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే కొంతమంది కార్మికులకు మాత్రమే ఏపీ ప్రభుత్వం హెల్త్ అలోవెన్స్ ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కొన్ని కేటగిరీల కార్మికులకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్య విభాగంలోని కొన్ని కేటగిరీల కార్మికులకు రూ.6 వేల చొప్పున హెల్త్ అలవెన్స్ ప్రకటించింది. పట్టణాల్లో పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్లకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వర్కర్లు, శానిటేషన్ వాహనాల డ్రైవర్లకు హెల్త్ అలవెన్స్, మలేరియా వర్కర్లకూ హెల్త్ అలవెన్స్ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Updated Date - Jan 02 , 2024 | 07:59 AM