జీఎస్‌ఎల్ సేవలు స్ఫూర్తిదాయకం
ABN, Publish Date - Aug 18 , 2024 | 03:37 AM
వైద్య రంగంలో విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు సమకూర్చడంతో పాటు ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి వెంట వచ్చే బంధువులకు అతి తక్కువ ధరలకు అల్ఫాహారం,
సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా
రాజానగరం, ఆగస్టు 17: వైద్య రంగంలో విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు సమకూర్చడంతో పాటు ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి వెంట వచ్చే బంధువులకు అతి తక్కువ ధరలకు అల్ఫాహారం, భోజన సదుపాయాలు కల్పించడం స్ఫూర్తిదాయకమని సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వం గా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎ్‌సఎల్-స్వతంత్ర ఇన్‌స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన 38 వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసిన సందీప్ రెడ్డి మాట్లాడుతూ జీఎ్‌సఎల్ మెడికల్ కళాశాలలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటుచేసిన స్మార్ట్ ల్యాబ్, లైబ్రరీ వంటి సదుపాయాలను చూస్తుంటే తాను విదేశాల్లో ఉన్నానన్న భావన కలిగిందన్నారు. తాను సినీ రంగంలోకి రాకముందు ఫిజియోథెరపీ కోర్సు చదివానని, ఈ కారణంగానే తమ సినిమాలలో మెడికల్ నాలెడ్జ్ కు సంబంధించిన అంశాలను అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్ సినిమాల్లో తెరకెక్కించానన్నారు. విద్యా సంస్ధల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు మాట్లాడుతూ రూ.10కు అమ్మ భోజనం, రూ.5కు అమ్మ ఇడ్లీ సదుపాయాన్ని కల్పించామన్నారు.
Updated Date - Aug 18 , 2024 | 05:25 AM