Pawan: వివిధ జిల్లాల ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు
ABN, Publish Date - Feb 15 , 2024 | 09:21 AM
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ జిల్లాల ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవన్ భీమవరం పర్యటనకు హెలికాప్టర్ అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు కలిగించింది. దీంతో ఆయన ఆయా జిల్లాల నేతలను పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ జిల్లాల ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవన్ భీమవరం పర్యటనకు హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు కలిగించింది. దీంతో ఆయన ఆయా జిల్లాల నేతలను పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో చేపట్టాల్సిన సమావేశాలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం పవన్ రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై కూడా పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు.
కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయగోదావరి జిల్లాల పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బుధవారం నియోజకవర్గం ఇన్‌చార్జులు, ముఖ్యనాయకులతో ఆయన భేటీ కావాల్సి ఉంది. అందుకు తగ్గట్లుగా పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. స్థానిక విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలోని హెలీపేడ్ వద్ద దిగేందుకు కాలేజీ యాజమాన్యం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అయితే అక్కడ అనువుగా ఉండదంటూ ఆర్ అండ్ బీ అధికారులు అనుమతి నిరాకరించారు. దాంతో పవన్ కల్యాణ్ పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం దురుద్దేశంతోనే అనుమతులు ఇవ్వలేదంటూ జనసేన నాయకులు మండిపడ్డారు.
Updated Date - Feb 15 , 2024 | 10:14 AM