ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

2034 వరకూ హైదరాబాద్‌ ‘ఉమ్మడి’ కావాలి

ABN, Publish Date - Mar 03 , 2024 | 03:13 AM

మరో పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ హైకోర్టులో వాజ్యం దాఖలైంది.

మరో పదేళ్లు కొనసాగించేలా చట్టం చేయాలి

ఈ మేరకు కేంద్ర హోం శాఖను ఆదేశించండి

హైకోర్టులో ‘కృష్ణా’ జిల్లా వాసి వాజ్యం

అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): మరో పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ హైకోర్టులో వాజ్యం దాఖలైంది. ఈ మేరకు చట్టం తెచ్చేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని అందులో కోరారు. హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని ప్రకటించిన గడువు ఈ ఏడాది జూన్‌ 2తో ముగుస్తున్నా ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు తొమ్మిదవ షెడ్యూల్‌లోని కంపెనీలు, కార్పొరేషన్ల ఆస్తుల విభజన పూర్తి కాలేదని అందులో పేర్కొన్నారు. 2034 జూన్‌ 2వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా, కేంద్ర హోంశాఖకు ప్రతిపాదన పంపించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని కోరారు. ఉమ్మడి కృష్ణాజిల్లా, ఇబ్రహీంపట్నంకి చెందిన ప్రజాసంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్‌ కుమార్‌ ఈ పిల్‌ దాఖలు చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా విభజించడంతో రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తున్నా ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, అంగీకారం, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆస్తుల విభజన వివాదాలకు దారితీసింది.

చట్టబద్ధమైన విధులు నిర్వర్తించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడంతో వివాదాలు పరిష్కారానికి నోచుకోలేదు. పునర్విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో మొత్తం 91 కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. 90 సంస్థల విషయంలో నిపుణుల కమిటీ ఒకే విధానాన్ని అనుసరించకపోవడంతో సిఫారసులను రాష్ట్రాలు అంగీకరించలేదు. సమస్యల పరిష్కారం పై కేంద్రం దృష్టి సారించకపోవడంతో వివాదాలు కోర్టుకు చేరుతున్నాయి. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలోనే వివాదాలు పరిష్కారం కావాలి. లేకుంటే ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయి. విభజన హామీలు అమలు కానందున హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరే హక్కు ఏపీకి ఉంటుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని 2034వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు చట్టం తెచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి’ అని వాజ్యంలో కోరారు.

Updated Date - Mar 03 , 2024 | 03:13 AM

Advertising
Advertising