అన్నా క్యాంటీన్లు పేదలకు వరం
ABN, Publish Date - Sep 19 , 2024 | 11:35 PM
అన్నా క్యాంటీన్లు ఏర్పాటు పేదలకు ఒక వరమని, ధరలు పెరిగినా సీఎం చంద్రబాబునాయుడు రూ.5కే మళ్లీ ప్రారంభించారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి
జమ్మలమడుగు, సెప్టెంబరు 19: అన్నా క్యాంటీన్లు ఏర్పాటు పేదలకు ఒక వరమని, ధరలు పెరిగినా సీఎం చంద్రబాబునాయుడు రూ.5కే మళ్లీ ప్రారంభించారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం రాత్రి ఎమ్మెల్యే అన్నా క్యాంటీన్ రిబ్బన్ కట్ చేసి పునఃప్రారంభించారు. అనంతరం ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టుబట్టి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికి అభివృద్ధిపై ముందుకెళ్లడం సంతోషకరమన్నారు. అందులో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో జమ్మలమడుగు- ఎర్రగుంట్ల అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు ఎక్కడా కోతలు లేకుండా రోడ్ల రిపేరు, ఆస్పత్రి అభివృద్ధి తదితరవన్నీ చేస్తున్నామన్నారు. వంద రోజుల పాలనలో తాను చెప్పిన విధంగా చెప్పినట్లుగా పనులు ప్రారంభించామన్నారు. రూ.300 కోట్లు రోడ్ల రిపేరు కోసం రిలీజ్ చేశారన్నారు. ఇక జమ్మలమడుగుకు కన్యతీర్థంలోనే స్టీల్‌ప్లాంట్, పది వేల మెగావాట్లతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ రాబోతోందన్నారు. అలాగే దాల్మియా ఎక్స్‌టెన్షన్, అదాని స్టీల్‌ప్లాంట్ వస్తున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో డ్రైనేజీపై గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. గత ఆరు సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో అక్టోబరు 2న అన్నా క్యాంటీన్ ప్రారంభం జరిగిందని, జగన్ వచ్చిన తర్వాత పేదలకు అన్నం పెట్టకుండా తీసివేశాడని, అందుకే ఆ దరిద్రం పోయిందన్నారు. టీడీపీ ఇన్‌ఛార్జి భూపేశ్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం తిరిగి అన్నా క్యాంటీన్‌ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. వంద రోజుల పాలనలో సీఎం అభివృద్ధిపై దృష్టి పెట్టారన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మంచి చేస్తోందన్నారు. అనంతరం భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఛైర్‌పర్సన్ శివమ్మ, కమిషనర్ ప్రమోద్‌కుమార్, వారి సిబ్బంది, మెప్మా సిబ్బంది, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ పోరెడ్డి రామలక్షుమ్మ, టీడీపీ మండల అధ్యక్షుడు సింగంరెడ్డి నాగేశ్వరరెడ్డి, పట్టణ నేత పురుషోత్తంరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, కౌన్సిలర్ బానా శివరామలింగారెడ్డి, పోలీసు లక్ష్మిదేవి, చంద్ర, ఇతర అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బద్వేలుటౌన్: పేదప్రజల ఆకలిని తీర్చేందుకు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లు ఒక వరమని టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రితీ్‌షకుమార్‌రెడ్డి అన్నారు. గురువారం బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లా ఆవరణలో అన్నా క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశన్నతో కలిసి మాట్లాడుతూ నిత్యావసర ధరలు పెరిగి అధికంగా ఉన్న సమయంలో కూడా రూ.5కే భోజనం అందించడం సంతోషకరమన్నారు. అనంతరం స్వయంగా రితీ్‌షకుమార్‌రెడ్డి నిరుపేదలకు భోజనం వడ్డించి, కూటమి నాయకులతో కలిసి అక్కడే భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటనరసింహారెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంగల్‌రెడ్డి, పోరుమామిళ్ల సర్పంచ్ యనమల సుధాకర్, రాగిమాను ప్రతా్‌పకుమార్, మిత్తికాయల రమణ, సునీత, బిగ్‌బాస్, జహంగీర్‌బాషా, నరసింహనాయుడు, మస్తాన్‌బాబు, సీనియర్ న్యాయవాది పీవీఎన్ ప్రసాద్, నాగభూ షణం, రామక్రిష్ణ, బొమ్మన విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - Sep 19 , 2024 | 11:35 PM