ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సిరులు కురిపిస్తున్న డ్రాగన ఫ్రూట్‌

ABN, Publish Date - Aug 28 , 2024 | 11:02 PM

: బీడు భూముల్లో సైతం బంగారం పండించవచ్చు అని నిరూపిస్తున్నారు చిట్వేలి మండల రైతులు. సంప్రదాయ పంటలతో ఆశించిన ఆదాయం రాక

విరగకాసిన డ్రాగన పండు

చిట్వేలి, ఆగస్టు 28: బీడు భూముల్లో సైతం బంగారం పండించవచ్చు అని నిరూపిస్తున్నారు చిట్వేలి మండల రైతులు. సంప్రదాయ పంటలతో ఆశించిన ఆదాయం రాకపోవడంతో అన్నదాత ఆలోచన ఉద్యాన పంటలవైపు దృష్టి సారిస్తున్నా రు. అందులో విదేశీ పంటను కూడా సాగుచేస్తూ వినూత్న పద్ధతులు మెళవకులు పాటిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. కరోనా సమయంలో మొదలైన ఆలోచన మండలంలో నూతన పంటవైపు అడుగులు వేసింది. ఔషధ గుణాలు మెండుగా కలిగిన డ్రాగన ఫ్రూట్‌ సాగుపై దృష్టిపెట్టి లాభాలు గడిస్తున్నారు. మండల పరిధిలోని రాజుకుంటకు చెందిన నానబాల మనోహర్‌ 2021 జనవరిలో అర ఎకరా పొలంలో 250 స్తంభాలు ఏర్పాటు చేసి, వెయ్యి మొక్కలు నాటి సాగు మొదలు పెట్టారు. నాటి నుంచి నేటి వరకు లాభాలు గడిస్తూ, సాగు విస్తీర్ణం మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి రసాయన ఎరువులతో కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి సొంతంగా జీవామృతం తయారు చేసి ఆర్గానిక్‌ పద్ధతిలో పంట సాగు చేస్తున్నారు.

తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు

అరటి, బొప్పాయ, పూలతోటల సాగులో అధిక పెట్టుబడులు పెట్టినా నష్టపోతున్న రైతులు. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలికంగా లాభాలు వచ్చే డ్రాగన ఫ్రూట్‌ సాగుపై దృష్టి సారిస్తు న్నారు. మండలంలో ప్రస్తుతం 10 ఎకరాల వరకు రైతులు సాగు చేస్తున్నారు. ప్రతి ఏడు జూలై నుంచి డిసెంబరు వరకు దిగుబడి వస్తుం ది. రైతులే ఒక కిలో 150కి మార్కెట్లో అమ్ము తూ లాభాలు గడిస్తున్నారు. .

Updated Date - Aug 28 , 2024 | 11:02 PM

Advertising
Advertising