అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..!
ABN, Publish Date - Mar 11 , 2024 | 10:40 PM
ఒక్క అవకాశం ఇవ్వండి రాయచోటి రూపు రేఖలు మార్చి చూపిస్తానని రాయచోటి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కోరారు.

టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
రాయచోటిటౌన్, మార్చి11: ఒక్క అవకాశం ఇవ్వండి రాయచోటి రూపు రేఖలు మార్చి చూపిస్తానని రాయచోటి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కోరారు. సోమవారం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని 28, 29, 30 వార్డుల్లో ప్రచారం సందర్భంగా దర్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మహిళల కోసం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో ఏసీతో కూడిన మెటర్నిటీ హాస్పిటల్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. రాయచోటి పేరుకు మాత్రమే గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అని, ఇక్కడ ఎలాంటి మౌలిక వసతులు కూడా లేవన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే రాబోయే రెండు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, సమస్యలు పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సలావుద్దీన్, మైనార్టీ నేతలు ఖాదర్ హుస్సేన్, జాఫర్‌అలీ, అబ్దుల్‌రహీం, ఎజాస్, సయ్యద్ ఆబిద్ హుస్సేన్, ఇర్షాద్, జిలాన్, మహమ్మద్‌అలీ, జావీద్‌హుస్సేన్, జాకీర్‌హుస్సేన్, పటాన్ ముజీద్‌ఖాన్, మైనుద్దీన్, అతావుల్లా, షంషీర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 11 , 2024 | 10:40 PM