ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెడ్డిచెరువును కబ్జా చేస్తున్న అక్రమార్కులు

ABN, Publish Date - Aug 30 , 2024 | 11:32 PM

మండలంలోని రెడ్డిపల్లె, కొండూరు గ్రామానికి చెందిన రెడ్డి చెరువును సుమారు 20 ఎకరాలను ఎక్స్‌కవేటర్లు పెట్టి చదను చేసి అక్రమార్కులు ఆక్రమించారు. శుక్రవారం డోజర్లు, ఎక్స్‌కవేటర్లు ట్రాక్టర్లు పెట్టి చదును చేస్తుండగా స్థానికులు రెవెన్యూ అధికారులు సమాచారం ఇవ్వడంతోవీఆర్వో దొరబాబు, ఆర్‌ఐ కరీముల్లా చెరువు దగ్గరకు వెళ్లేసరికి ఆక్రమణదారులు పరారైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

ఎక్స్‌కవేటర్‌తో చదును చేస్తున్న ఆక్రమణదారులు

చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు

అట్లూరు, ఆగస్టు 30 : మండలంలోని రెడ్డిపల్లె, కొండూరు గ్రామానికి చెందిన రెడ్డి చెరువును సుమారు 20 ఎకరాలను ఎక్స్‌కవేటర్లు పెట్టి చదను చేసి అక్రమార్కులు ఆక్రమించారు. శుక్రవారం డోజర్లు, ఎక్స్‌కవేటర్లు ట్రాక్టర్లు పెట్టి చదును చేస్తుండగా స్థానికులు రెవెన్యూ అధికారులు సమాచారం ఇవ్వడంతోవీఆర్వో దొరబాబు, ఆర్‌ఐ కరీముల్లా చెరువు దగ్గరకు వెళ్లేసరికి ఆక్రమణదారులు పరారైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. గతంలో చెరువును ఆక్రమించి చీనీ చెట్లు కూడా నాటి కంచెలు వేశారని స్థానికులు రెవెన్యూ అఽఽధికారులకు తెలిపారు. రెవెన్యూ రికార్డులు ప్రకారం చెరువు విస్తీర్ణం 55 ఎకరాలు ఉంటుందని సర్వేయరు సుబ్బారెడ్డి తెలిపారు. రెడ్డిచెరువు కింద సుమారు 200 ఎకరాలు పారుదల ఉంటుందన్నారు. చుట్టుపక్కల చీనీ తోటలకు చెరువు నీటితో బోరుబావులు జలాలు పెరుగుతాయని, అటువ ంటి చెరువును సుమారు 20 ఎకరాలు ఆక్రమణదారులు చెరువును మట్టితో పూడ్చడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుందని రైతులు తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి చెరువు ఆక్రమణలను తొలగించాలని రెడ్డిపల్లె, కొండూరు రైతులు కోరుతున్నారు. రెడ్డిపల్ల చెరువు ఆక్రమణపై అట్లూరు తహసీల్దారు శివశంకర్‌ను వివరణ కోరగా, ఆక్రమించిన చెరువును సర్వేచేయించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని, హెచ్చరిక బోర్డులు పెట్టిస్తామని తహసీల్దారు తెలిపారు.

Updated Date - Aug 30 , 2024 | 11:33 PM

Advertising
Advertising