ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేత్ర దానంతో అంధుల జీవితాల్లో వెలుగు

ABN, Publish Date - Sep 03 , 2024 | 10:41 PM

నేత్రదానంతో అంధుల జీవితాల్లో వెలుగు సాధ్యమవు తుందని మేడి కుర్తి వైద్యురాలు డాక్టర్‌ కావ్యగంధ తెలిపారు.

వాల్మీకిపురం మండలం చింతపర్తిల్లో ర్యాలీ చేస్తున్న వైద్య సిబ్బంది

కలికిరి, సెప్టెంబర్టు 3: నేత్రదానంతో అంధుల జీవితాల్లో వెలుగు సాధ్యమవు తుందని మేడి కుర్తి వైద్యురాలు డాక్టర్‌ కావ్యగంధ తెలిపారు. మండలంలోని మేడికుర్తి పీహెచసీలో మంగళ వారం జాతీయ నేత్ర దాన పక్షోత్సవాల సంద ర్భంగా నిర్వహించిన సమావేశంలో నేత్ర దానం పై అవగాహన కల్పించారు. మరణించిన వారి నేత్రాలతో అంధులకు చూపు తెప్పించవచ్చని, దీని కోసం స్వచ్చంద సేవా సంస్థలు విరివిగా కృషి చేస్తున్నాయన్నారు. ప్రపంచంలో వున్న అంఽ దుల్లో భారతదేశంలో నాలుగవ వంతు ఉన్నార నేది ఆందోళన కలిగించే విషయమన్నారు. నేత్ర దానం కోసం ముందుగానే నమోదు చేసుకోన వసరం లేదని, మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యుల ఆమోదంతో కూడా నేత్ర దానం చేయ వచ్చని వివరించారు. వ్యక్తి మరణించిన ఆరు గంటలలోపు నేత్రాలను వేరుచేస్తే ఇతరులకు అ మర్చే అవకాశముం టుందన్నారు. ఈ సందర్భం గా నేత్రదానం ఆవశ్యకతమై వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మహ్మద్‌ రఫీ, పర్యవేక్షకులు నాగి రెడ్డి, హేమలత, ఏఎనఎంలు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వాల్మీకిపురం: 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవా ల్లో భాగంగా మంగళవారం మండలంలోని చింతపర్తి పీహెచసీ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. నేత్రదానం ప్రాముఖ్యత, కంటి చూపు ఆవశ్యకతలపై ప్రజలు పూర్తి అవ గాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీవిద్య, జులేఖాబేగం, హెల్త్‌ఎడ్యుకేటర్‌ మహ్మద్‌రఫి, సూపర్‌వైజర్లు సుధాకర్‌, బానుబీ, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 10:41 PM

Advertising
Advertising