రాజధాని రైతుల భావోద్వేగమే ‘రాజధాని ఫైల్స్’
ABN, Publish Date - Feb 17 , 2024 | 11:00 PM
రాజధాని కోసం తన పంట పొలాలను త్యాగం చేసిన అమరావతి రైతుల భావోద్వేగం రాజధాని ఫైల్స్ సినిమా అని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్ కస్తూరి విశ్వనాథనాయుడు తెలిపారు.
టీడీపీ ఇన్‌చార్జ్ కస్తూరి
రైల్వేకోడూరు(రూరల్) ఫిబ్రవరి 17: రాజధాని కోసం తన పంట పొలాలను త్యాగం చేసిన అమరావతి రైతుల భావోద్వేగం రాజధాని ఫైల్స్ సినిమా అని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్ కస్తూరి విశ్వనాథనాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రైతులపై కక్ష సాధింపులు, దండయాత్రలు అన్నీ ఈ సినిమాలో డైరెక్టర్ క్లుప్తంగా చూపించారన్నారు. పట్టణంలోని లవ థియేటర్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు ఉచిత ప్రధర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ ఈ సినిమా చూసి రాజధాని రైతులకు సంఘీభావం తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు మహిళ నాయకురాలు అనితా దీప్తి, మైనారిటీ నాయకులు పఠాన్ మౌలా భాష, ఓబులవారిపల్లి మండల అధ్యక్షులు వెంకటేశ్వరరాజు, కోడూరు మాజీ మార్కెట్ యార్ట్ అధ్యక్షులు కమతం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రసన్న వేంకటేశ్వర స్వామికి పూజలు
రైల్వేకోడూరు: రాష్ట్రంలో టీడీపీకి 170 స్థానాలు రావాలని కోరుకుంటూ పట్టణంలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామికి శనివారం టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గెలవాలని శ్రీవారిని కోరుకున్నామని తెలిపారు. కాకతీయ సేవా సమితి కమ్మ భవన్ శంకుస్థాపనకు టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాథనాయుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు తదితరులకు జిల్లా కమ్మ సంఘం అధ్యక్షుడు గొల్లపూడి శివనారాయణచౌదరి అందజేశారు. ఈ కార్యక్రమాల్లో మాచినేని విశ్వేశ్వర నాయుడు, బీసీ నాయకుడ కమతం నాగరాజుయాదవ్, రాజంపేట పార్ల మెంట్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు తేనేపల్లి చిన్నా, మహిళా నాయకురాలు దుద్యాల అనితదీప్తి, టీడీపీ సీనియర్ నాయకులు గడికోట సుబ్బరాయుడు, నాయకులు కొల్లా నరసింహులు, మారోతు మల్లి, నాగినేని నవీన్, కాకర్ల నాగేశ్వరనాయుడు, రైల్వేకోడూరు పట్టణ అధ్యక్షుడు పోకల మణి, రాజంపేట పార్లమెంట్ టీడీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి బుంగటావుల రాజశేఖర్, యువ నాయకుడు కస్తూరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 17 , 2024 | 11:00 PM