ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kodi Kathi Case: ఐదేళ్లుగా జైలులోనే కోడికత్తి శీను.. దీక్ష చేయనున్నాడా?

ABN, Publish Date - Jan 17 , 2024 | 10:49 AM

Andhrapradesh: కోడికత్తి కేసులో గత ఐదేళ్లుగా నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శీను జైలులోనే మగ్గుతున్న పరిస్థితి. ఇప్పటికీ రిమాండ్ ఖైదీగానే జైల్లోనే ఉన్న శ్రీనివాస్ ఆవేదన వర్ణణాతీతం.

అమరావతి, జనవరి 17: కోడికత్తి కేసులో (Kodi Kathi Case) గత ఐదేళ్లుగా నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శీను జైలులోనే మగ్గుతున్న పరిస్థితి. ఇప్పటికీ రిమాండ్ ఖైదీగానే జైల్లోనే ఉన్న శ్రీనివాస్ ఆవేదన వర్ణణాతీతం. ఈ కేసుకు సంబంధించి శీను కుటుంబసభ్యులు అనేకమార్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) నివాసానికి వెళ్లినప్పటికీ ఫలితం శూన్యం. బాధితుడిగా ఉన్న సీఎం జగన్ నిరభ్యంతర పత్రం ఇవ్వాలని, బెయిల్‌కు అడ్డంకులు తొలగించాలని అభ్యర్థించినప్పటికీ ముఖ్యమంత్రి స్పందించని పరిస్థితి.

దీంతో శ్రీనివాస్ నేటికి కూడా రిమాండ్ ఖైదీగానే జైల్లో ఉండిపోయాడు. ఈ క్రమంలో తనకు న్యాయం జరిగే వరకూ జైలులోనే దీక్ష చేస్తానంటూ శీను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జైలులో మగ్గుతున్న శీను ఆవేదనపై ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో లాయర్ సలీం, శీను కుటుంబసభ్యులు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 17 , 2024 | 10:52 AM

Advertising
Advertising