Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన భవానీ దీక్ష విరమణలు..
ABN, Publish Date - Jan 03 , 2024 | 07:30 AM
విజయవాడ: ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం భవాని దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం ఐదు రోజులపాటు కొనసాగనుంది. ఆలయ అధికారులు, అర్చక స్వాములు నాలుగు హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం భవాని దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం ఐదు రోజులపాటు కొనసాగనుంది. ఆలయ అధికారులు, అర్చక స్వాములు నాలుగు హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు. భవానీ భక్తులు నేతి టెంకాయలను సమర్పించి భవాని దీక్షలను విరమణ చేస్తున్నారు. ‘జై దుర్గా జై జై దుర్గా’ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. కనుచూపు మేరకు ఎర్రని దుస్తులతో ఇంద్రకీలాద్రి ఆలయానికి భవాని భక్తులు పోటెత్తారు.
భవానీ భక్తులు ప్రత్యేక కౌంటర్లలో ఇరుముడులను సమర్పిస్తున్నారు. మూడు షిఫ్ట్‌లలో 300 మంది గురు భవానీలు.. కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. 20 లక్షల లడ్డూలను భవానీలకు అందుబాటులో ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షణలో భవానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Updated Date - Jan 03 , 2024 | 07:31 AM