ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

ABN, Publish Date - Feb 12 , 2024 | 12:58 AM

అన్ని రంగాల్లో గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టగల సమర్థుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడని, ఆయనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బాబు ష్యూరిటి- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా యార్లగడ్డ వెంకట్రావు నిడమానూరులో సుడిగాలి పర్యటన చేసి చంద్రబాబు హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించడంతో పాటు 2024లో అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు.

నిడమానూరులో పర్యటిస్తున్న యార్లగడ్డ వెంకట్రావు

గుణదల, ఫిబ్రవరి 11 : అన్ని రంగాల్లో గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టగల సమర్థుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడని, ఆయనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బాబు ష్యూరిటి- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా యార్లగడ్డ వెంకట్రావు నిడమానూరులో సుడిగాలి పర్యటన చేసి చంద్రబాబు హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించడంతో పాటు 2024లో అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. యువతను ఉత్సాహ పరిచేందుకు గ్రామంలోని పలు వీధుల్లో మోటారు బైక్‌పై తిరుగుతూ అభివాదం చేశారు. అలాగే ప్రచార రథంపై నుంచి అభివాదం చేస్తూ కార్యకర్తలను చైతన్యవంతులను చేశారు. జగన్మోహనరెడ్డి ఇచ్చే తాయిలాలకు లోబడి ఓటు వేయడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరన్న విషయాన్ని వైసీపీ నాయకత్వం తెలుసుకుంటే మంచిదని సూచించారు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు, మద్యం ఎంతమాత్రం ప్రభావం చూపవన్నారు. దీనికి ప్రధాన కారణం వైసీపీ అధికారంలో ఉంటే సామాన్య ప్రజలు జీవనం సాగించే పరిస్థితి లేకపోవడ మేనన్న సత్యాన్ని ప్రజలు గ్రహించడమేనని చెప్పారు. చంద్రబాబు, పవన్‌ల మాదిరిగా జగన్మోహనరెడ్డికి ప్రజల్లోకి వెళ్లే దమ్ము ధైర్యం లేవన్నారు. అఽధికారంలోకి రాకముందు జగన్మోహనరెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజలకు చాలా దగ్గరగా ఉండేవాడని అధికారం చేతికి వచ్చాక ఆయన ప్రజలకు చాలా దూరంగా ఉంటున్నారన్న విషయం అందరూ చూస్తునే ఉన్నారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చేది చంద్రబాబే అని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ, గుజ్జర్లపూడి బాబూ రావు, దండు సుబ్రహ్మణ్యంరాజు, గొడ్డళ్ల చిన ్న రామారావు, పరుచూరి నరేష్‌, అద్దేపల్లి సాంబు, గూడవల్లి నరసయ్య, బొప్పన హరికృష్ణ, నబిగాని కొండ, బండి వెంకట్రావు, కానూరు యుగంధర్‌, అడుసుమిల్లి నవీన్‌, బండి బాబ్జి, నల్లూరి రవికాంత్‌, కోనేరు సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 12:58 AM

Advertising
Advertising