ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: పొర్లు దండాలతో మున్సిపల్ కార్మికుల వినూత్న నిరసన

ABN, Publish Date - Jan 05 , 2024 | 01:23 PM

Andhrapradesh: సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 11 రోజులకు చేరింది. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలంటూ పొర్లు దండాలతో కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చారని.. సమాన పనికి సమాన వేతనం, కాంటాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని చెప్పారన్నారు.

విజయవాడ, జనవరి 5: సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 11 రోజులకు చేరింది. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలంటూ పొర్లు దండాలతో కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చారని.. సమాన పనికి సమాన వేతనం, కాంటాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని చెప్పారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేయలేని పని తాము చేసి చూపిస్తాం అన్నారన్నారు. ఆయన మాటలు నమ్మి కార్మికులు ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. ఐదేళ్లుగా హామీలు అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు.

మంత్రులను పంపించి చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. ఆర్థికపరమైన అంశాల విషయంలో జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. సీఎం నేరుగా స్పందించకుండా మరోసారి మోసం చేస్తున్నారన్నారు. తమకు వేతనాలు పెంచకుండా ప్రైవేటు వ్యక్తులను తీసుకువచ్చి పనులు చేయిస్తారా అంటూ మండిపడ్డారు. వారికి అదనంగా డబ్బు ఇచ్చే బదులు తమ వేతనాలు పెంచొచ్చు కదా అని అడిగారు. తమరో తామే కొట్టుకునే విధంగా ప్రభుత్వం రెచ్చగొట్టడం దుర్మార్గమన్నారు. కరోనా సమయంలో ప్రాణాలు తెగించి పని చేశామన్నారు. జగన్మోహన్ రెడ్డి ని నమ్మితే బాగా బుద్ధి చెప్పారన్నారు. జగన్ హామీలు అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతామన్నారు. హామీలు అమలు చేయకుంటే జగన్ రాజకీయంగా అడ్రెస్ లేకుండా పోవడం ఖాయమని మున్సిపల్ కార్మికులు హెచ్చరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 05 , 2024 | 01:26 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising