ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సైకో పాలనలో సంక్షేమ పథకాలు రద్దు

ABN, Publish Date - Feb 15 , 2024 | 01:03 AM

సైకో జగన్‌రెడ్డి పాలనలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు చెందిన సంక్షేమ పథకాలన్ని రద్దు జాబితాలోకి చేరిపోయాయని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం పెనమలూరు చెరువుకట్టపై జరిగిన బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీల పక్షమేనని, వారికి మొట్టమొదట 24శాతం రిజర్వేషన్లు కల్పించింది అన్న ఎన్టీఆర్‌ అని, రిజర్వేషన్‌లను చంద్రబాబు 34శాతం చేశాడని గుర్తు చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీల సమగ్రాభివృద్దికి చిత్తశుద్ధితో కృషి చేసిన పార్టీ కేవలం టీడీపీ మాత్రమేనని పేర్కొన్నారు.

పెనమలూరు చెరువు కట్టపై జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న బోడె ప్రసాద్‌

పెనమలూరు, ఫిబ్రవరి 14 : సైకో జగన్‌రెడ్డి పాలనలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు చెందిన సంక్షేమ పథకాలన్ని రద్దు జాబితాలోకి చేరిపోయాయని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం పెనమలూరు చెరువుకట్టపై జరిగిన బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీల పక్షమేనని, వారికి మొట్టమొదట 24శాతం రిజర్వేషన్లు కల్పించింది అన్న ఎన్టీఆర్‌ అని, రిజర్వేషన్‌లను చంద్రబాబు 34శాతం చేశాడని గుర్తు చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీల సమగ్రాభివృద్దికి చిత్తశుద్ధితో కృషి చేసిన పార్టీ కేవలం టీడీపీ మాత్రమేనని పేర్కొన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి అవరోధంగా ఉన్న 217 జీవోలను రద్దు చేసిన ఘనత టీడీపీదేననీ, అదనంగా మరో 54 కులాలను బీసీల్లో చేర్చి వారికి రిజర్వేషన్ల రుచి చూపించింది టీడీపీయేనన్నారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి వారిని దారుణంగా మోసం చేశాడని దుయ్యబట్టారు. కార్యక్రమంలో నాయకులు మారుపూడి ధనకోటేశ్వరరావు, కోయ ఆనంద్‌ ప్రసాద్‌, అనుమోలు ప్రభాకరరావు, సంగెపు రంగారావు, మట్టా జాన్‌, మటపర్తి బుజ్జి, శీలం ఆదాం, షేక్‌ సైదులు, దుర్గారావు, కిలారు నవీన్‌, యలమంచిలి ప్రసాద్‌, అరవపల్లి శివప్రసాద్‌, కొల్లిపర ప్రమోద్‌, గూడవల్లి పూర్ణ, అంగిరేకుల మురళి పాల్గొన్నారు.

చోడవరంలో బోడె హేమ పాదయాత్ర

చోడవరంలో జరిగిన పాదయాత్రలో బోడె ప్రసాద్‌ సతీమణి హేమ స్థానిక నాయకులతో కలిసి ప్రజలను కలిశారు. వచ్చే ఎన్నికల్లో బోడె ప్రసాద్‌ను ఎమ్మెల్యేగా, చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఆమె వెంట కలపాల శ్రీధర్‌, మేడసాని రత్నకుమారి, మల్లంపాటి విజయలక్ష్మి, చోడవరపు హేమలత, నెప్పల్లి హరీష్‌, వెలిసెల రఘు, కోలవెన్ను మురళి, కళ్తోటి రామకృష్ణ, సింహాద్రి కృష్ణవేణి, మద్దాల వీరయ్య, స్వరూపరాణి, మల్లంపాటి సుబ్బారావు, కలపాల జ్యోతి, సరస్వతి, రాధిక ఉన్నారు.

యనమలకుదురులో..

యనమలకుదురులో జరిగిన పాదయాత్రలో టీడీపీ తాడిగడప మునిసిపాలిటీ కార్యదర్శి మొక్కపాటి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో స్థానికులను నాయకులు కలిశారు. ఎక్కడ చూసినా విపరీతంగా దోమలు ఇబ్బంది పెడుతున్నాయని స్థానికులు వాపోయారు. కార్యక్రమంలో పండల రజిని, బలగం కొండ పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 01:03 AM

Advertising
Advertising