ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: గుడివాడలో ‘రా.. కదలిరా’ సభా ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ నేతలు

ABN, Publish Date - Jan 16 , 2024 | 02:42 PM

Andhrapradesh: గుడివాడలో చంద్రబాబు ‘‘రా...కదలిరా’’ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం సభా ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర నేతలు పరిశీలించారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎంపీ మాగంటి బాబు, టీడీపీ నాయకత్వానికి సభా ఏర్పాట్లను పార్టీ ఇంచార్జి వెనిగండ్ల రాము వివరించారు.

కృష్ణా జిల్లా, జనవరి 16: గుడివాడలో చంద్రబాబు ‘‘రా...కదలిరా’’ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం సభా ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర నేతలు పరిశీలించారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎంపీ మాగంటి బాబు, టీడీపీ నాయకత్వానికి సభా ఏర్పాట్లను పార్టీ ఇంచార్జి వెనిగండ్ల రాము వివరించారు.

ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. ఈనెల 18న చంద్రబాబు కదిలి..రా సభతో చరిత్ర సృష్టిస్తామన్నారు. రాష్ట్రానికి గుడివాడ ప్రతిష్టాత్మకమని..టీడీపీ మొదట ఓడించే సీటు గుడివాడే అని అన్నారు. చంద్రబాబు సభ ద్వారా రాష్ట్రానికి ఓ సందేశాన్ని పంపిస్తామని తెలిపారు. గుడివాడ ఎమ్మెల్యే లాంటి వ్యక్తి రాజకీయాల్లో అనర్హుడన్నారు.


మాగంటి బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో చైతన్యం కలిగిన గుడివాడ సభతో వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గుడివాడలో జరిగే ఈ కార్యక్రమాల్లో ఏలూరు పార్లమెంటు నుంచి పెద్ద ఎత్తున పాల్గొంటామన్నారు. రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు అన్నీ భరిస్తున్నారన్నారు. వెనిగండ్ల రాము నాయకత్వంలో సభా ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని అన్నారు.

వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. అనేక ప్రత్యేకతలతో గుడివాడలో దిగ్విజయంగా జరగనున్న సభలో భాగస్వామ్యం కావడం తన అదృష్టమన్నారు. గుడివాడ సభకు రాష్ట్ర ప్రజలందరూ ఆహ్వానితులే అని.. గుడివాడ పౌరుషాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెబుతామన్నారు. చంద్రబాబు సభకు అవాంతరాలు సృష్టించాలని, గడ్డం గ్యాంగ్ కుటిల ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని.. ఎవరొచ్చిన తొక్కి పడేస్తామని హెచ్చరించారు. తమకు దైవ సమానులైన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు. జన సైనికుల కృషి చూస్తుంటే సంతోషంగ ఉందని వెల్లడించారు.

Updated Date - Jan 16 , 2024 | 08:25 PM

Advertising
Advertising