ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సైకో పాలనపై ప్రజల్లో తిరుగుబాటు

ABN, Publish Date - Mar 12 , 2024 | 12:31 AM

సైకో సీఎం జగన్‌ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైసీపీని ఇంటికి సాగనంపడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ డోన్‌ నియోజకవర్గ అభ్యర్థి కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి అన్నారు.

టీడీపీ డోన్‌ అభ్యర్థి కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి

ప్యాపిలి, మార్చి 11: సైకో సీఎం జగన్‌ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైసీపీని ఇంటికి సాగనంపడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ డోన్‌ నియోజకవర్గ అభ్యర్థి కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో టీడీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం బస్టాండ్‌ ఎదురుగా నిర్వహించిన సభలో కోట్ల మాట్లాడారు. ఒక్క చాన్స్‌తో సైకో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, మరో అవకాశం ఇస్తే ఏపీని ఎవరూ కాపాడలేరన్నారు. డోన్‌ నియోజకవర్గంలో కోట్ల, కేఈ కుటుంబాల సహకారంతోనే అభివృద్ధి జరిగిందని తెలిపారు. తన తండ్రి దివంగత కోట్ల విజయభాస్కరెడ్డి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. అలాగే కేఈ క్రిష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రిగా నియోజకవర్గంలో తమ వంతు అభివృద్ధి చేసినట్లు ఈ సందర్భంగా కోట్ల చెప్పు కొచ్చారు. తమ దగ్గర డబ్బులు లేకున్న ప్రజాభిమానం ఉందని, అధికార పార్టీ ప్యాకేజీలు పంపిణీ చేసినా డోన్‌లో బుగ్గన ఓడటం ఖాయమన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చా రు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆదరించి చంద్రబాబును సీఎంగా చేసుకుందామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ సాధికార సమితి కన్వీనర్‌ వై నాగేశ్వరరావుయాదవ్‌, నాయకులు టి.శ్రీనివాసులు, అలేబాదు పరమేష్‌, గండికోట రామసుబ్బయ్య, మాధవరం స్వామి, రామ్మోహన్‌యాదవ్‌, చల్లా వీరాంజినేయులు, ఖాజాపీర్‌, గండికోట రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:31 AM

Advertising
Advertising