ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధి పనులను వేగవంతం చేయండి: గౌరు చరిత

ABN, Publish Date - Nov 07 , 2024 | 12:28 AM

కల్లూరు అర్బన 16 వార్డుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): కల్లూరు అర్బన 16 వార్డుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని ఎస్‌బీఐ కాలనీ న్యూ కౌన్సిల్‌ హాల్లో ఆమె 16 వార్డుల అభివృద్ధి నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు ఆధ్వర్యంలో ఇంజనీర్లు, అధికారులు, సచివా లయ అడ్మిన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ కల్లూరు అర్బన వార్డుల పరిధిలో కౌన్సిల్‌ తీర్మానించిన పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అర్బన వార్డుల్లో తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని అఽధికారులను ఆదేశించారు. పార్క్‌ స్థలాల్లో ఇళ్లపట్టాలు ఎలా ఇస్తారని తక్షణమే పార్క్‌లు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. నగరంలో పగటి పూట తాగునీటి సరఫరా సమయం పెంచాలని, పారి శుధ్య సిబ్బందిని పెంపునకు చర్యలు తీసుకోవాలన్నారు. పందిపాడు, లక్ష్మీపురం గ్రామాలకు హంద్రీనీరే శరణ్యమని అక్కడ ప్రజ లకు నుగరనీరు సరఫరా చేస్తున్నా రని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఆ గ్రామాల్లో నీరు కలుషి తం కాకుండా చర్యలు తీసుకో వాలని అఽధికారులను ఆదేశించారు. పంది పాడులో లోఓల్టేజీ సమస్య వేధిస్తుం దని వార్డు నాయకులు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు మాట్లాడుతూ అర్బన వార్డుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇస్తామని, వార్డులో చేప డుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, ఎస్‌ఈ రాజశేఖర్‌, ఎంఈ శేష సాయి, ఆరోగ్యశాఖ అధికారి డా. విశ్వేశ్వరరెడ్డి, సిటీప్లానర్‌ ప్రదీప్‌కుమార్‌, మేనేజర్‌ చిన్నరాముడు, కల్లూరు అర్బన వార్డుల కన్వీ నర్‌ పెరుగు పురుషోత్తంరెడ్డి, నంద్యాల జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు కె. పార్వతమ్మ, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌యాదవ్‌, టీడీపీ వార్డు ఇనచార్జిలు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 12:28 AM