ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాష్ట్ర ప్రయోజనాలకే పొత్తులు

ABN, Publish Date - Mar 11 , 2024 | 12:36 AM

వైసీపీ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడ టంతోపాటు ప్రజల ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయని కేంద్ర మాజీ మంత్రి, డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు.

డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి

డోన్‌, మార్చి 10: వైసీపీ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడ టంతోపాటు ప్రజల ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయని కేంద్ర మాజీ మంత్రి, డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. ఆదివారం కర్నూలులోని కోట్ల నివాసంలో బీజేపీ జిల్లా కార్యదర్శి వడ్డె మహారాజ్‌, ఆర్మీ రామయ్య, డోన్‌ మండల అధ్యక్షులు ఆంజనేయులు, ఉమ్మాజిరావు, శశి, వెంకటేశ్‌ తదితరులు మర్యాదపూర్వకంగా కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి అభ్యర్థి కోట్ల గెలుపు కోసం కృషి చేస్తామని ఈ సంద ర్భంగా బీజేపీ నాయకులు ప్రకటించారు. అనంతరం కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్‌ నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. రూ.లక్షల కోట్లు అప్పులు చేసినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండటం దౌర్భాగ్యమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం టీడీపీ హయాంలో అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసి వేయడం పేదల కడుపు కొట్టడం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభు త్వ విధ్వంస విధానాల వల్ల రాష్ట్ర అభివృద్ధి మరో 20 ఏళ్లు వెనక్కు వెళ్లిం దన్నారు. చంద్రబాబు హయాంలో రైతులకు ఎన్నో రాయితీలు ఉండేవని, వాటన్నింటినీ రద్దు చేసి సీఎం జగన్‌ రైతుల ద్రోహిగా మిగిలిపోయా రన్నారు. కరువు ప్రాంతాల్లో రైతులను ఆదుకునే చర్యలు వైసీపీ ప్రభుత్వం అసలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో వైసీపీని గద్దె దించేందుకు చంద్రబాబు చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిందని తెలిపారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం చేయడమే చంద్రబాబు లక్ష్యమన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 07:00 AM

Advertising
Advertising