బడుగు, బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం: ఎమ్మెల్యే
ABN, Publish Date - Oct 27 , 2024 | 01:24 AM
టీడీపీ బడుగు, బలహీన వర్గాల పార్టీ అని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు.
ఎమ్మిగనూరు, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): టీడీపీ బడుగు, బలహీన వర్గాల పార్టీ అని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో టీడీపీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పట్టణానికి చెందిన సీనియర్ నాయకుడు మునీరుద్దీనకు పార్టీ సభ్యత్వాన్ని అందజేసి సన్మానించారు. అలాగే నియో జకవర్గంలోని ఎమ్మిగనూరు పట్టణం, మండలం, నంద వరం, గోనెగండ్లకు చెందిన టీడీపీ నాయకులు నరసన్న గౌడు, జగదీష్, జహీర్, గట్టు అల్తాఫ్, ఖాసీంవలి, వెంకట రామిరెడ్డి, మల్లయ్య, సురేష్‌చౌదరి, వలితో పాటు మరో ఐదుగురికి శాశ్వత సభ్యతాన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదును రెండు నెలల్లోపు పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గోనెగండ్ల: గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చిన్నమరివీడు గ్రామం లో ఆయన పర్యటించారు. జలజీవన మిషన రూ. 58లక్షల నిధులతో నిర్మించే తాగునీటి పథకానికి భూమి పూజ చేశారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్య తీర్చేందుకు గాను జలజీవన మిషన పథకం కింద పనుల శరవేగంగా జరుగుతాయని ప్రతి ఇంటి ఉచిత కొళాయి ఇస్తున్నామన్నారు. రెండో విడతలో వచ్చే నిధు లతో చిన్నమరివీడు గ్రామంలో సీసీరోడ్డు, డ్రైనేజీ పనులు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నజీర్‌సాహెబ్, తిరుపతయ్యనాయుడు, షేక్షావలి, నూర్‌అహ్మద్, రంగస్వామినాయుడు, వినోద్ గౌడ్, అడ్వకేట్ చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, చిన్ననేలటూరు నాగన్న, ఎర్రబాడు శ్రీనివాసులు, తిమ్మారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Oct 27 , 2024 | 01:24 AM