తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే
ABN, Publish Date - Oct 11 , 2024 | 12:20 AM
ఆళ్లగడ్డలో తాగునీటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు.
ఆళ్లగడ్డ(శిరివెళ్ల), అక్టోబరు 10: ఆళ్లగడ్డలో తాగునీటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో చైర్మన రామలింగారెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు చొరవతో 0.6 టీఎంసీలుగా ఉన్న గండ్లేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 0.9 టీఎంసీలకు పెంచేందుకు రూ.40 కోట్లతో త్వరలోనే పనులు ప్రారంభించ నున్నట్లు ఆమె వెల్లడించారు. ఆళ్లగడ్డలో మున్సిపల్ హాల్ నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మున్సిపాలిటీల్లో వీధి దీపాల నిర్వహణకు గత ప్రభుత్వంలో రూ.400 కోట్ల బకాయిలు ఉండడంతో ప్రస్తుతం తలె త్తుతున్న సమస్యను పరిష్కరించాలని మంత్రి నారాయణతో చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అర్హులందరికీ టిడ్కో ఇళ్లు, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి, వైస్ చైర్మన నాయబ్ రసూల్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Updated Date - Oct 11 , 2024 | 12:20 AM