ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

ABN, Publish Date - Dec 01 , 2024 | 12:15 AM

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

వెంకాయపల్లెలో పింఛన్లు పంపిణీ చేస్తున్న కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి

కర్నూలు రూరల్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు మండలం వెంకాయపల్లె గ్రామంలో శనివారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. వైసీపీ హయాంలో పేదలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. వితంతులు, వికలాంగులు, వృద్ధులకు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన డబ్బులను పెంచిందన్నారు. కార్యక్రమంలో కర్నూలు మండల ఎంపీడీవో రఘునాథ్‌, ఈవోఆర్డీ అనూ రాధ, పంచాయతీ కార్యదర్శి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

కల్లూరు: టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆవ్వాతాతలకు భరోసా ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శనివారం నగరంలోని 21వ వార్డు శాంతినగర్‌లో ఎమ్మెల్యే పింఛన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచను ఇచ్చి ప్రజల చిరకాల కోరికను నేరవేర్చిన ఘనతా సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కార్యక్ర మంలో కర్నూలు మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మన పెరుగు పురుషోత్తంరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ యాదవ్‌, రాఘవేంద్ర, వెంకటరెడ్డి, పల్లె రఘునాథ్‌రెడ్డి, విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 12:15 AM