ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జమిలి ఎన్నికలు వస్తాయని సంబరపడుతున్నారు

ABN, Publish Date - Dec 14 , 2024 | 12:19 AM

జమిలి ఎన్నికలు వస్తాయని వైసీపీ నాయకులు సంబరపడుతున్నారని, అయితే జమిలి ఎన్నికల వల్ల వైసీపీ శాశ్వతంగా ప్రతిపక్షంలో కూచుంటుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు.

బీటీ రోడ్డు పనులకు భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే

వైసీపీ శాశ్వతంగా ప్రతిపక్షంలోనే కూర్చోవాలి

ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి

రూ.రెండు కోట్లతో పట్టణంలో బీటీ రోడ్లు

ఎమ్మిగనూరు, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): జమిలి ఎన్నికలు వస్తాయని వైసీపీ నాయకులు సంబరపడుతున్నారని, అయితే జమిలి ఎన్నికల వల్ల వైసీపీ శాశ్వతంగా ప్రతిపక్షంలో కూచుంటుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం పట్ట ణంలో రూ. రెండు కోట్లతో బీటీ రోడ్లకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకె ళ్తోందన్నారు. దీన్ని జీర్ణీంచుకోలేని వైసీపీ నాయకులు మసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు జెమిలి ఎన్నికలు వస్తున్నాయని సంబరపడుతున్నారని, ఏ ఎన్నికలు వచ్చినా ఇక నుంచి ప్రజలు వైసీపీ నాయకులను నమ్మరన్నారు. జగనకు ప్రజలు రెండో అవకాశం ఇవ్వరని అన్నారు. ఈ విషయం మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తెలియజేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోకుండా వీలైతే మంచి సలహాలు ఇవ్వాల న్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి, టీడీపీ నాయకులు చేనేతమల్లి, మిన్నప్ప, జయన్న, గల్లా సలాం, కటారి రాజేంద్ర, ప్రతాప్‌రెడ్డి, తురేగల్‌ నజీర్‌, సలీం, వెంకటేశు, నవాజ్‌, వాహీద్‌, మహేష్‌, అంజి, శాలేం, కామార్తి మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2024 | 12:35 AM