ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రహదారులకు మహర్దశ

ABN, Publish Date - Nov 03 , 2024 | 12:57 AM

ఏన్డీఏ కూటమి ప్రభుత్వంలో రహదా రులకు మహర్దశ రానుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

రోడ్డు మరమ్మతు పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత

రోడ్డు మరమ్మతు పనులను ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఏన్డీఏ కూటమి ప్రభుత్వంలో రహదా రులకు మహర్దశ రానుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శనివారం నంద్యాల చెక్‌పోస్ట్‌ సమీపంలోని ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలకు మరమ్మతు పనులను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రోడ్లను ఏ మాత్రం బాగుచేయలేదని, పల్లెల నుంచి పట్ట ణాల రహదారులు అడుగుల మేర గోతులు ఏర్పడ్డాయన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోని రాగానే అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు రోడ్డు మరమ్మతు పనులకు నిధులు విడుదల చేశారని అన్నారు. జనవరి 31 లోపు పాణ్యం నియోజక వర్గంలోని రహదారుకు మరమ్మతు పనులు చేపట్ట నున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ అండ్‌ బీ డీఈ విజయ భారతి, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన పెరుగు పురుషోత్తంరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ యాదవ్‌, పాణ్యం వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 12:57 AM