Kurnool Dist.: ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వర స్వామి ఉత్సవాలు
ABN, Publish Date - Jan 25 , 2024 | 07:18 AM
కర్నూలు: ఎమ్మిగనూరు ప్రజల ఆరాధ్యదైవం నీలకంఠేశ్వర స్వామి ఉత్సవాలు గురువారం నుంచి జరగనున్నాయి. ఉత్సవాల్లో మొదటి రోజు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు.
కర్నూలు: ఎమ్మిగనూరు ప్రజల ఆరాధ్యదైవం నీలకంఠేశ్వర స్వామి ఉత్సవాలు గురువారం నుంచి జరగనున్నాయి. ఉత్సవాల్లో మొదటి రోజు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి.. స్వామివారిని పుష్ప రథంపై ఊరేగిస్తారు. రాత్రి ఆలయంలో వరుడు మహాశివుడి తరుపున గడిగె కుటుంబానికి చెందిన వారు... వధువు పార్వతీదేవి తరుఫున బండ కుటుంబానికి చెందినవారు పెద్దలుగా వ్యవహరించి వివాహ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొంటారు.
నెల రోజుల పాటు జరిగే నీలకంఠేశ్వర స్వామి వారి జాతర గురువారం నుంచి మొదలవుతుంది. దాదాపు 300 ఏళ్ల క్రితం కాశీ నుంచి శివలింగాన్ని ఎద్దుల బండిపై తీసుకొచ్చి ఎమ్మిగనూరు ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఏటా పుష్యమాసంలో శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తున్నారు. మత సామరస్యానికి ప్రత్యేకంగా ఈ జాతర నిలుస్తుంది. నెల రోజులపాటు అక్కడ వ్యాపారాలు కొనసాగుతాయి.
Updated Date - Jan 25 , 2024 | 07:18 AM