అధికారులు సమన్వయంతో పని చేయాలి: ఎమ్మెల్యే
ABN, Publish Date - Oct 04 , 2024 | 12:43 AM
మండల అభివృద్ధి కోసం అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ఓర్వకల్లు, అక్టోబరు 3: మండల అభివృద్ధి కోసం అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గురువారం ఓర్వకల్లులోని ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీపీ తిప్పన్న అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గౌరు చరిత హాజరయ్యారు. అంతకుముందు ఎమ్మెల్యేకు అధికా రులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. సమావేశంలో గతంలో చర్చించిన అంశాలు, వాటి పురోగతిపై అధికారులు సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా గుట్టపాడు సర్పంచ మోహన రెడ్డి వైసీపీ హయాంలో ఏపీఐఐసీలో భూములు కోల్పోయిన ఎన.కొంతలపాడు మీదివేముల గ్రామాల్లో భారీ అవినీతి జరిగిందని, వాటిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కల్పించుకుని విచారణ చేపట్టాలని తహసీల్దార్ సూచించారు. ఓర్వకల్లులో ఇంటి పట్టాల పంపిణీలో అక్రమాలు జరిగాయని సభా దృష్టికి తీసుకెళ్లగా.. జడ్పీటీసీ రంగనాథగౌడు కూడా జోక్యం చేసుకుని వాటిపై విచారణ చేపట్టి అరు ్హలైన వారికి పట్టాలు ఇవ్వాలని కోరారు. మీదివేముల ఎంపీటీసీ పద్మనా భరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని, కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మండలానికి రూ.4కోట్లు దాకా నిధులు మంజూరు చేసిందని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1452 కోట్లు 15వ ఫైనాన్స ద్వారా మంజూరు చేసిందన్నారు. బదిలీపై వెళ్తున్న ఎంపీడీవో శివనాగప్రసా ద్‌ను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విద్యాసాగర్, ఆయా శాఖ అధికారులు, సర్పం చులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Updated Date - Oct 04 , 2024 | 12:43 AM