ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:06 AM

క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. సోమవారం కల్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో జి.నాగశేషాచలరెడ్డి ఆధ్వర్యం లో చేపట్టిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మండల వ్యాప్తంగా మొత్తం 113 వినతులు నమోదయ్యాయి. ఈసందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ ప్రజలు సమస్యలను అధికా రులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. గ్రీవెన్సకు వచ్చిన అర్జీలు మరలా రిపీట్‌ కాకుండా అధికారులు ప్రజలు, రైతులకు సేవలందించాలని అదే శించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో రెవెన్యూ శాఖ-44, పంచాయతీ రాజ్‌-17, డీఆర్‌డీఏ- 14, ఆర్‌డబ్ల్యూఎస్‌-10, విద్యుత శాఖ-6 ఉన్నాయి. కార్యక్రమంలో తహసీల్దారు కె.ఆంజ నేయులు, ఏపీ ఫైనాన్స అర్బన ఇనప్రాస్ట్రక్షర్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ డి.రామాంజ నేయులు, టీడీపీ నాయకులు ఈవీ రమణ. వినోద్‌, సర్పంచు సహరాబీ, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 01:06 AM