ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ ధ్యేయం

ABN, Publish Date - Oct 10 , 2024 | 12:26 AM

పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.

అల్పాహారం వడ్డిస్తున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ(శిరివెళ్ల), అక్టోబరు 9: పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని టీబీ రోడ్డులో నిర్మించిన అన్న క్యాంటీనను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. పేదలకు అల్పాహారం వడ్డించడంతో పాటు వారితోనే కలిసి ఆమె అల్పాహారం తిన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను మూసివేయించిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించి ఇది ప్రజా ప్రభుత్వమని చాటి చెప్పిందన్నారు. రాష్ట్రంలో అధిక శాతం వైసీపీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం నిధులు కేటాయించకపోగా కేంద్రం నుంచి వచ్చిన నిధులను కాజేసి పంచాయతీ వ్యవస్థను భ్రష్టు పట్టించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట రామిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన రామలింగారెడ్డి, వైస్‌ చైర్మన నాయబ్‌ రసూల్‌, కౌన్సిలర్‌ హుసేన బాషా, టీడీపీ నాయకులు శేఖర్‌రెడ్డి, బద్రి సుధాకర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 12:26 AM