ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చంద్రబాబుతోనే సంక్షేమం: గౌరు చరిత

ABN, Publish Date - Sep 21 , 2024 | 01:19 AM

సంక్షోభంలోనూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించడం సీఎం చంద్రబాబుకే సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

కొంగనపాడులో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, సెప్టెంబరు 20: సంక్షోభంలోనూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించడం సీఎం చంద్రబాబుకే సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. రాష్ట్రంలో ఎనడీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించేలా ముఖ్యమంత్రి ఆదేశించారు. అందులో భాగంగా శుక్రవారం కల్లూరు మండలం కొంగనపాడులో మండల ప్రత్యేక అధికారి దీప్తి ఆధ్యక్షతన చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. టీడీపీ మండల అధ్యక్షుడు డి. రామాంజనేయులు, ఉలిందకొండ టీడీపీ నాయకుడు ఈవీ. రమణ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఇంటింటికీ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అతికించి అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎనడీఏ కూటమి ప్రభుత్వం 16437 పోస్టులకు మోగా డీఎస్సీ ప్రకటించి నిరుద్యోగ యువతకు అండగా నిలిచిందన్నారు. అనంతరం కొంగనపాడు అభి వృద్ధికి ఎనఆర్‌ ఈజీయస్‌ కింద రూ.15 లక్షల నిధులను ఎమ్మెల్యే కేటాయిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్‌రెడ్డి, వాకిటి మాదేష్‌, పందిపాడు శేఖర్‌, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 01:19 AM