కూలీలు వలసలు వెళ్లొద్దు : పీడీ అమర్‌నాథ్‌రెడ్డి
ABN, Publish Date - Mar 12 , 2024 | 11:43 PM
గ్రామాల్లోని రైతులు, కూలీలు వలసలు వెళ్లొద్దని, గ్రామాల్లోనే ఉపాధి పథకం ద్వారా పనులు కల్పిస్తున్నామని డ్వామ పీడీ అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు.
గోనెగండ్ల, మార్చి12: గ్రామాల్లోని రైతులు, కూలీలు వలసలు వెళ్లొద్దని, గ్రామాల్లోనే ఉపాధి పథకం ద్వారా పనులు కల్పిస్తున్నామని డ్వామ పీడీ అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం గోనెగండ్ల మండల పరిధిలోని తిప్పనూరు గ్రామంలో జరుగుతున్న ఉపాఽధి పనులను ఆయన పరిశీలించారు. గతకొన్ని రోజులుగా కాలువ పూడిక తీత, కుంటల పూడిక తీత పనులు జరుగుతున్నాయి వాటిని పరిశీలించి ఈ పనులకు రోజుకు ఎంతమంది కూలీలు హాజరవుతున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ గ్రామాలలో చేపడుతున్న పనులకు ఉపాధి కూలీలు హాజరవాలని కోరారు. వలసల నివారణ కోసం ప్రతి గ్రామంలో ఉపాధి పనులు చేపడుతున్నామన్నారు. ప్రతి కూలీ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్‌కార్డు, జాబ్ కార్డు లింక్ చేసుకోవాలన్నారు. ప్రతి రోజూ ప్రతి ఉపాధి కూలీకి రూ. 270 కూలీ పడేలా పని చేయాలని సూచించారు. రైతులు పంట్ల తోటల పట్ల ఆసక్తిచూపాలని మామిడి, మునగ తదితర పంటలు సాగు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీవో మహుమ్మద్ బాషా, ఉస్మాన్‌బాషా, ఉమామహేశ్వరమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Mar 12 , 2024 | 11:43 PM