AP News: బిడ్డా.. కొట్టొద్దురా! అని వేడుకున్నా వినకుండా..
ABN, Publish Date - Mar 04 , 2024 | 03:34 AM
నవమాసాలు మోసి, కని పెంచిన కన్నవారిపైనే ఓ కొడుకు మానవత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు.
తల్లి జట్టుపట్టి ఈడ్చి.. ఎగిరి గుండెలపై తన్ని.. తండ్రినీ చెంపలపై కొట్టి దాష్టీకం
ఓ ఉన్మాది పుత్రుడి కాఠిన్యం.. ఆస్తి వెంటనే ఇవ్వలేదని విచక్షణారహితంగా దాడి
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఘటన.. వీడియో వైరల్
మూణ్నెల్లుగా కొడుతున్నాడని ఫిర్యాదిచ్చినా పట్టించుకోని పోలీసులు?
మదనపల్లె టౌన్, మార్చి 3: నవమాసాలు మోసి, కని పెంచిన కన్నవారిపైనే ఓ కొడుకు మానవత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు. తన స్తన్యమిచ్చి ఆకలి తీర్చి.. గుండెలపై మోసి లాలించిన కన్నతల్లి గుండెలపైనే ఎగిరి తన్నాడు. తనకు ఆస్తి వెంటనే రాసివ్వలేదన్న అక్కసుతో.. కదలలేని స్థితిలో మంచానికి పరిమితమైన తండ్రిపైనా విచక్షణారహితంగా దాడి చేశాడు. సభ్య సమాజం తలదించునే ఈ సంఘటన అన్నమ య్య జిల్లా మదనపల్లె పట్టణం అయోధ్యనగర్‌లో శనివారం చోటు చేసుకుంది. దీనికి సంబంఽధించిన వీడి యో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మదనపల్లె టూటౌన్ సీఐ యువరాజు కథనం మేరకు.. బి.కొత్తకోట మండ లం బయ్యప్పరెడ్డిపల్లెలోని గుంతవారిపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి(72), లక్ష్మమ్మ దంపతులకు మనోహర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి కొడుకులున్నారు. వీరికి గ్రామ సమీపంలో మూడెకరాల భూమి, రెండెకరాల డీకేటీ పొలం ఉంది. ఇద్దరూ చెరి సగం వ్యవసాయం చేసుకుంటున్నారు. పదేళ్ల క్రితం చిన్నకొడుకు శ్రీనివాసులురెడ్డి వ్యవసాయం చేయలేడని మదనపల్లెలో చే నేత మగ్గాల పనిలో చేర్చారు. అప్పటి నుంచి వృద్ధాప్యంలో ఉన్న వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మ దంపతులు మదనపల్లె పట్టణం అయోధ్యనగర్‌లోని చిన్నకుమారు డు శ్రీనివాసులురెడ్డి వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో 2010లో రెండెకరాల డీకేటీ పట్టాలో బోరు వేసి, వేరు భాగాలు చేసుకున్నారు.
మనోహర్‌రెడ్డి పేరిట రాసిన భూములను తన పేరిట రాసిమ్మని శ్రీనివాసులురెడ్డి తల్లిదండ్రులను డిమాండ్ చేశాడు. అందుకు వారు ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించిన చిన్న కొడుకు శ్రీనివాసులురెడ్డి శనివారం తల్లిని దుర్భాషలాడు తూ జుట్టుపట్టుకుని ఈ డ్చుకుంటూ వెళుతూ.. కాలితో తల్లి ఎదపై పలుమార్లు తన్ని దాడి చేశాడు. ఆమె వీపును గుద్దుతూ, చెంపలపై కొడుతూ విచక్షణారహితంగా దాడి చేశాడు. ‘కొట్టొద్దు బిడ్డా’ అని ఆ తల్లి వేడుకుంటున్నా.. కనికరం చూపకుండా తీవ్రంగా కొట్టాడు. కదలలేని స్థితిలో మంచంపై కూర్చొన్న తండ్రి వెంకటరమణారెడ్డిని సైతం కాలితో తంతూ, చెంపలపై కొట్టాడు. అక్క డే ఉన్న ఓ బాలిక ఈ ఘటనను వీడియో తీసి సోష ల్ మీడియాలో పోస్టు చేయడంతో అది ఆదివారం వైరలైంది. దీంతో కర్నూల్ రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు ఆదేశాలతో మదనపల్లె టూటౌన్ సీఐ యువరాజు వేగంగా స్పందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మ దంపతులను విచారించారు. నిందితుడు శ్రీనివాసులురెడ్డిపై ఐపీసీ సెక్షన్ 324, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా, మూడు నెలలుగా తమను కొడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా.. సర్దుబాటు చేసి పంపుతున్నారే తప్పచర్యలు తీసుకోలేదని బాధితులు తెలిపారు.
Updated Date - Mar 04 , 2024 | 08:02 AM