ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాశ్‌రెడ్డి

ABN, Publish Date - Feb 28 , 2024 | 03:18 AM

ఏపీ సీఎం జగన్‌ బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-8గా ఉన్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌ సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న చంచల్‌గూడ జైల్లో ఉన్న

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : ఏపీ సీఎం జగన్‌ బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-8గా ఉన్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌ సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న చంచల్‌గూడ జైల్లో ఉన్న గంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డిలను జైలు నుంచి తరలించి కోర్టులో హాజరుపర్చారు. వీరి రిమాండ్‌ను మార్చి 12 వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇదే కేసులో ఏ-4 ఉండి అప్రూవర్‌గా మారిన దస్తగిరి కోర్టుకు హాజరుకాకపోవడంతో గతంలో జారీచేసిన నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ను సీబీఐ కోర్టు ఉపసంహరిస్తూ (రీకాల్‌) ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై దస్తగిరి వేసిన రీకాల్‌ పిటిషన్‌ను అనుమతించిన సీబీఐ కోర్టు.. వారంట్‌ను ఉపసంహరించింది.

Updated Date - Feb 28 , 2024 | 08:31 AM

Advertising
Advertising