ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

kadambari jethwani: లీగల్ టీంతో జిత్వాని కుటుంబం భేటీ

ABN, Publish Date - Aug 30 , 2024 | 09:10 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో చిత్రహింసలకు గురైన ముంబాయి హీరోయిన్ కాదంబరీ జిత్వాని కుటుంబం‌ లీగల్ బృందంతో భేటీ అయ్యింది. ఈ భేటీ ముగియడంతో మరికొద్దిసేపట్లో పోలీసు అధికారుల విచారణ ప్రారంభం కానుంది. ఈ విచారణ సుమారు 2 గంటలపాటు జరిగే అవకాశం ఉంది.

Kadambari Jithvani

అమరావతి: వైసీపీ ప్రభుత్వ హయాంలో చిత్రహింసలకు గురైన ముంబాయి హీరోయిన్ కాదంబరీ జిత్వాని కుటుంబం‌ లీగల్ బృందంతో భేటీ అయ్యింది. ఈ భేటీ ముగియడంతో మరికొద్దిసేపట్లో పోలీసు అధికారుల విచారణ ప్రారంభం కానుంది. ఈ విచారణ సుమారు 2 గంటలపాటు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత డీజీపీ లేదా సీపీని జిత్వాని కుటుంబం కలవనుంది. అనంతరం వారు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.


కాగా న్యాయవాదులతో భేటీలో జిత్వాని కుటుంబం సభ్యులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముంబైలో జిందాల్‌పై కేసు ఉపసంహరించుకునేందుకు ఇక్కడ తనను అక్రమంగా కేసులో ఇరికించారని జిత్వాని చెప్పారు. ఇబ్రహీంపట్నంలో నమోదు అయిన కేసులో వారు కొన్న స్టాంప్ పేపర్లు 2023లో కొనుగోలు చేసినవని చెప్పారు. ఈ మేరకు ముంబైలో సమాచారం సేకరించినట్టు జిత్వాని కుటుంబం పేర్కొంది. తన అక్రమ నిర్భందం, అరెస్టు వెనుక పోలీసు అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని ఉన్నారని జిత్వాని చెప్పినట్లు తెలుస్తోంది.


తమను వేధించిన తీరును కూడా జిత్వాని కుటుంబ సభ్యులు వివరించారు. జిత్వానితో పాటు ఆమె తల్లి, తండ్రి కూడా విజయవాడకు వచ్చారు. మొత్తం కుటుంబంతో లీగల్ టీం మాట్లాడారు.


న్యాయవాది ఏమన్నారంటే?

పోలీసులు జత్వానీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నారని జత్వాని న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. స్టేట్‌మెంట్‌లో ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నీతో పాటు మరో ఇద్దరు అధికారులు ఇబ్బందులకు గురి చేశారని స్టేట్‌మెంట్ ఇచ్చారని తెలిపారు. ‘‘నటిపై ఎక్కడా ఎలాంటి కేసులు లేవు. 41ఏ నోటీసులు ఇవ్వాల్సిన కేసులో కుట్ర పూరితంగా పోలీసులు వ్యవహరించారు. సీనియర్ సిటీజన్లుగా ఉన్న నటి తల్లిదండ్రులను జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేశారు. దీని వెనుక ఎవరైనా ఉన్నారేమో పోలీసు విచారణలో తేలుతుంది. నటిపై ఫిర్యాదు చేసిన కుక్కల విద్యాసాగర్ చూపుతున్న అగ్రిమెంట్ కూడా కేసు పెట్టడం కోసం తయారు చేసిందే. నటి జత్వానీ, ఆమె తల్లి నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్నారు’’ అని వివరించారు.

Updated Date - Aug 30 , 2024 | 09:26 PM

Advertising
Advertising