ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో వసతులు కల్పించండి
ABN, Publish Date - Mar 04 , 2024 | 10:33 PM
ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు.
నెల్లూరు(వైద్యం), మార్చి 4 : ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ చాంబర్‌లో జరిగిన ఆత్మకూరు జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో చేపట్టాల్సిన పనులను గుర్తించి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఏసీలు, వాషింగ్ మెసిన్, ప్రొజెక్టర్‌లు తదితర పరికరాలను దాతల సహకారంతో సమకూర్చుకోవాలన్నారు. ఆసుపత్రిలో సైన్ బోర్డులు ఏర్పాటు, ఫర్నిచర్, మరుగుదొడ్లు మరమ్మతులు, తలుపులు ఏర్పాటు, ఫ్లంబింగ్ తదితర పనులను పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రమేష్‌నాథ్, సూపరింటెండెంట్ డాక్టర్ శేషారత్నం, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ సుధాకర్‌గౌడ్, డీఈ సాంబశివరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ కృష్ణకుమారి, ఏవో శ్రీనివాసులు తదతరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 04 , 2024 | 10:33 PM