ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓటర్లకు నేరుగా డబ్బులు ఇవ్వడమే అభివృద్ధా!

ABN, Publish Date - Mar 04 , 2024 | 10:42 PM

ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించి ఓటర్లకు నేరుగా డబ్బులు ఇస్తే చాలు అనుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు.

6ఎస్‌వీకే 4 : మాట్లాడుతున్న పల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి

నెల్లూరు(సాంస్కృతికం), మార్చి 4: ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించి ఓటర్లకు నేరుగా డబ్బులు ఇస్తే చాలు అనుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. నగరంలోని టౌన్‌ హాల్‌ళలో ‘ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం’ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సమాజాన్ని అభివృద్ధి చేసి సంపదను సృష్టించి ప్రజలకు ఉపాధి కల్పించడానికి బదులు నేరుగా డబ్బు పంపిణీ చేస్తే అదే అభివృద్ధి అని ప్రజలను నమ్మిస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలో వచ్చేందుకు పార్టీలు డబ్బులు లేవనే భావనతో మంచి అభ్యర్థులను నిలబెట్టలేకపోతున్నాయన్నారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి పల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ వలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉంచొద్దని ఎన్నికల కమిషన్‌ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఆ ఆదేశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దిక్కరిస్తూ వలంటీర్లే తమ సైన్యం అని, వారి సహకారంతో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ విషయమై తాము హైకోర్టును ఆశ్రయించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవ్‌ డెమోక్రసీ అధ్యక్షుడు కోడూరు రవీంద్రరెడ్డి, జనవిజ్ఞాన వేదిక నాయకుడు జి.మాల్యాద్రి మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన కళాజాత ఆకట్టుకుందన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 10:42 PM

Advertising
Advertising