GSLV F-14: రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలంటూ ఇస్రో ఛైర్మన్ ప్రత్యేక పూజలు
ABN, Publish Date - Feb 17 , 2024 | 10:25 AM
ఉమ్మడి నెల్లూరు: ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాధ్ శనివారం ఉదయం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎస్ఎల్వీ ఎఫ్-14 (Gslv. F-14) రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు. శనివారం సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు షార్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్-14 రాకెట్ ప్రయోగం విజయవంతం చేస్తామన్నారు.
ఉమ్మడి నెల్లూరు: ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాధ్ శనివారం ఉదయం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎస్ఎల్వీ ఎఫ్-14 (Gslv. F-14) రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు. శనివారం సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు షార్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్-14 రాకెట్ ప్రయోగం విజయవంతం చేస్తామన్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు. ఇన్‌స్టా 3డీ (INSAT. 3D) సీరీస్‌లో ఈ ఇన్‌స్టా 3డీఎస్ మూడవ ఉపగ్రహం.. GSLV.. F-15 ,, PSLV, SSLV. D3,, RLV.. TD రాకెట్ ప్రయోగాలను మరో రెండు మూడు నెలల వ్యవధిలో చేపడతామన్నారు. INSAT..3DS ఉపగ్రహం కాల పరిమితి 5 నుండి 10 సంవత్సరాలపాటు సేవలు అందిస్తుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాధ్ తెలిపారు. కాగా ఈ ప్రయోగం విజయవంతమైతే అన్నదాతలకు మేలు చేకూరనుంది.
Updated Date - Feb 17 , 2024 | 10:25 AM