ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అర్జీలకు సత్వర పరిష్కారం చూపండి

ABN, Publish Date - Mar 04 , 2024 | 10:27 PM

జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే అర్జీలకు తక్షణ పరిష్కారం చూపాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు.

1 కరుణానిధి 4 : అర్జీలు పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

నెల్లూరు(హరనాథపురం), మార్చి 4 : జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే అర్జీలకు తక్షణ పరిష్కారం చూపాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ తిక్కన భవన్‌లో జరిగిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారి నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ వాటి పరిష్కారంలో అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. నిర్దేశిత గడవులోగా అర్జీల పరిష్కారం జరిగిపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో లవన్న, డీపీవో సుస్మితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విడవలూరు మండలంలోని మత్స్యకార గ్రామాలకు పాఠశాలల సమయానికి బస్సులు నడపాలని కోరుతూ బీజేపీ నమామిగంగే రాష్ట్ర కన్వీనర్‌ మిడతల రమేష్‌ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. పొన్నపూడి పట్టపుపాళెం కేంద్రంగా పాఠశాల సమయానికి బస్సు సౌకర్యం సరిగా లేనందున బాలబాలికలు పాఠశాలలకు నడిచి వెళుతున్నారన్నారు.

జీజీహెచ్‌లో క్రోనోకార్పస్‌ చెట్లను తొలగించాలి

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఆవరణలో అనారోగ్యానికి కారణమైన క్రోనోకార్పస్‌ చెట్లను తొలగించాలని కోరుతూ సింహపురి చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బాబీభగత్‌ కలెక్టర్‌ హరినారాణన్‌కు వినతిపత్రం అందజేశారు. ఊపిరితిత్తులను దెబ్బతీసే ఈ క్రోనోకార్పస్‌ చెట్లను తొలగించాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వసుంధరాదేవి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సిద్దానాయక్‌లకు వినతిపత్రం అందించినా పట్టించుకోలేదన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 10:27 PM

Advertising
Advertising