ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirupati laddus: అయోధ్యకు ప్రత్యేకంగా లక్ష తిరుపతి లడ్డూలు

ABN, Publish Date - Jan 05 , 2024 | 05:53 PM

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జనవరి 22న అయోధ్య( Ayodhya)లోని రామ మందిర(ram temple) ప్రతిష్ఠాపనకు లక్ష లడ్డూ(Tirupati laddus)లను పంపిణీ చేయనున్నట్లు శుక్రవారం తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటించింది.

అయోధ్య(Ayodhya)లో కొత్తగా నిర్మించిన రామమందిరం(ram mandir) కుంభాభిషేకం, ప్రారంభోత్సవం ఈనెల 22న జరగనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఇప్పటికే శ్రీరామ జన్మ భూమి తీర్థ శేత్రం తరపున వివిధ పార్టీలతోపాటు ప్రముఖులకు ఆహ్వాన పత్రికను అందజేస్తున్నారు. ఈ వేడుకకు దేశంతోపాటు అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయ కుంభాభిషేకం దృష్ట్యా తిరుపతి శ్రీవారి ఆలయం నుంచి లక్ష లడ్డూలను అయోధ్యకు పంపనున్నట్లు తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటించింది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: AP Politics: పవన్‌పై దూషణలు.. జగన్‌ గెలుపుపై గట్టి ఎఫెక్ట్?

శ్రీ మహావిష్ణువు అవతారాల్లో భాగమైన శ్రీవేంకటేశ్వరుడు, రాముడి వేడుకల్లో పాల్గొనే భక్తులు, వీవీఐపీలకు తిరుపతి దేవస్థానం ద్వారా ఒక్కొక్కటి 25 గ్రాముల బరువున్న లక్ష లడ్డూ(Tirupati laddus)లను పంపిణీ చేయనున్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి AV ధర్మా రెడ్డి తెలిపారు. అయితే సాధారణంగా పంపిణీ చేసే లడ్డూలు 75 గ్రాములు ఉండగా..అయోధ్య భక్తుల కోసం ప్రత్యేకంగా తయారు చేయనున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. భక్తులతో 'డయల్ యువర్ ఈఓ' అనే ఇంటరాక్టివ్ సెషన్‌లో కార్యనిర్వాహక అధికారి ఈ మేరకు ప్రకటించారు. దర్శన సమయంలో ఆర్జిత సేవలు, విరాళాలు, సహా గదులను బుక్ చేసుకోవడానికి ttdevasthanams.ap.gov.in సందర్శించాలని భక్తులకు సూచించారు.

Updated Date - Jan 05 , 2024 | 05:53 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising