Janasena: జగన్ విష సంస్కృతి కుటుంబాలకూ పాకింది: పవన్ కళ్యాణ్
ABN, Publish Date - Feb 21 , 2024 | 04:15 PM
సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) తాను అవలంబిస్తున్న విష సంస్కృతిని కుటుంబాలకి కూడా వ్యాపించేలా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. సొంత చెల్లికి న్యాయం చేయని వ్యక్తి ప్రజలకేం న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
భీమవరం: సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) తాను అవలంబిస్తున్న విష సంస్కృతిని కుటుంబాలకి కూడా వ్యాపించేలా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విమర్శించారు. సొంత చెల్లికి న్యాయం చేయని వ్యక్తి ప్రజలకేం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. భీమవరంలో జనసైనికులతో పవన్ కళ్యాణ్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
"బీసీ కులాల మధ్య సఖ్యత లేకపోవడంతోనే జగన్ దగ్గర దేహీ అనాల్సి వస్తోంది. జగన్ దగ్గర అధికారం ఉంది. అందుకే ఆయన చెప్పిందే వేదంలా పరిస్థితులు ఉన్నాయి. వీటిని మార్చాలి. రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు బుద్ధి చెప్పడం తథ్యం. అణగారిన కులాలు అభివృద్ధి సాధించాలంటే, దాని అర్ధం ఇతర కులాలను తొక్కేయడం కాదు. అన్ని కులాలను సాధికారత దిశగా తీసుకువెళ్ళడం. రాజకీయాల్లో కూడా రిటైర్ మెంట్ అవసరం. కొత్తతరం వారికి అవకాశం ఇవ్వాలంటే, ఇది తప్పదు. జనసేన కొత్త తరం నాయకులకు అవకాశం ఇస్తుంది. దళితుడిని చంపిన వ్యక్తి జైలు నుంచి వస్తే పది వేల మందితో ఊరేగించారు. చంపింది ఒకరైతే మరోకులాన్ని వివాదంలోకి లాగారు. బంధుత్వం వేరు, రాజకీయం వేరు. మా అన్నయ్య చిరంజీవితో కొన్ని అంశాల్లో విబేధించి బయటకు వచ్చాను. మనుషులను జగన్ విడగొట్టారు. ఈ సంస్కృతి కుటుంబాలకు పాకింది. మాజీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తుల్లో వాటాను చెల్లి షర్మిలకు జగన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అలాంటి వ్యక్తి ప్రజలకు ఏం మంచి చేస్తారు" అని పవన్ అన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Feb 21 , 2024 | 04:31 PM