ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అక్రమాల ఫైళ్ల గుట్టలు!

ABN, Publish Date - Sep 27 , 2024 | 03:59 AM

జగన్‌ పాలనలో జరిగిన వేలకోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించి సీఐడీ బృందాలు భారీగా ఫైళ్లు, కంప్యూటర్లు, ఇతర ఆధారాలు స్వాధీనం చేసుకున్నాయి.

మద్యం కుంభకోణంలో సీఐడీ స్వాధీనం

విజయవాడలో మూడో రోజూ తనిఖీలు

డిజిటల్‌, ఫోరెన్సిక్‌, నిపుణులతో ఆడిట్‌ చేయుంచాలని నిర్ణయం

అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జగన్‌ పాలనలో జరిగిన వేలకోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించి సీఐడీ బృందాలు భారీగా ఫైళ్లు, కంప్యూటర్లు, ఇతర ఆధారాలు స్వాధీనం చేసుకున్నాయి. వాటిని విశ్లేషించేందుకు కనీసం మూడు నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నాయి. విజయవాడలోని ప్రసాదంపాడులో ఉన్న ఏపీ బ్రూవరీస్‌ కార్యాలయంలో మూడు రోజుల పాటు సీఐడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ సోదాలు గురువారం ముగిశాయి. మొత్తం ఆధారాలను మూడు విభాగాలుగా విభజించి డిజిటల్‌, ఫోరెన్సిక్‌, ఫైనాన్షియల్‌ ఆడిట్‌ చేయుంచాలని నిర్ణయం తీసుకుంది. జగన్‌ రెడ్డి పాలనలో నాసిరకం మద్యంతో ఐదేళ్ల పాటు కొనసాగించిన అవినీతి, అక్రమాల గుట్టను తవ్వి వెలికి తీయనుంది. డిజిటల్‌, ఫోరెన్సిక్‌, ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆయా రంగాల నిపుణులకు ఆధారాలు అప్పగించి సమగ్ర విశ్లేషణ చేయబోతోంది. కుంభకోణం ఎలా జరిగింది? ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి? మద్యం ఎంత ధరకు కొన్నారు? బేవరేజెస్‌ నుంచి బయటికి ఎంతకు విక్రయించారు? వంటి లావాదేవీల వెనకున్న అక్రమాలను వెలికి తీసేందుకు సీఐడీ సిద్ధమైంది. మద్యం ముడుపుల బాగోతం, నాసిరకం మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ప్రతిఫలాలు ఎవరెవరికి చేరాయి? వాటాల్లో ఎవరి వాటా ఎంత? అనేది క్షుణ్నంగా తేల్చేందుకు నడుం బిగించింది. ఏపీ బేవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఏ చిన్న ఆధారాన్ని కూడా వదిలి పెట్టకుండా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి ఆడిట్‌ జరిగిన తర్వాత పేదల రక్తాన్ని మద్యం కమీషన్ల రూపంలో తాగేసిన అసలు వ్యక్తులు బయటికి వస్తారని భావిస్తున్నారు. సీఐడీ వద్ద ఇమేజినరీ టెక్నికల్‌ టూల్స్‌ నాలుగు మాత్రమే ఉన్నాయని, డిజిటల్‌ ఆధారాలు కాపీ చేసుకోవడానికి చాలా టూల్స్‌ అవసరం అయ్యాయని ఒక అధికారి తెలిపారు.

Updated Date - Sep 27 , 2024 | 03:59 AM