ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అరాచక పాలన, అక్రమ కేసులు

ABN, Publish Date - Feb 25 , 2024 | 11:34 PM

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు. మండలంలోని పుట్టావారిపాలెం అతిథి గృహంలో ఆదివారం సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు, కొమ్మాలపాడు, సజ్జాపురం, కొప్పరం, ఏల్చూరు, పుట్టావారిపాలెం, సంతమాగులూరు గ్రామాలకు చెందిన యూనిట్‌, బూత్‌, పేజీ నేస్తం సభ్యులు, గ్రామపార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలన్నారు.

ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరుతున్న సంతమాగులూరు మండలం వైసీపీ నాయకులు, కార్యకర్తలు

- ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరిక

సంతమాగులూరు, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు. మండలంలోని పుట్టావారిపాలెం అతిథి గృహంలో ఆదివారం సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు, కొమ్మాలపాడు, సజ్జాపురం, కొప్పరం, ఏల్చూరు, పుట్టావారిపాలెం, సంతమాగులూరు గ్రామాలకు చెందిన యూనిట్‌, బూత్‌, పేజీ నేస్తం సభ్యులు, గ్రామపార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, భావితరాల ఉజ్వల భవిష్యత్తు బంగారుమయం కావాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళల అభివృద్ధికి చేపట్టనున్న మహాశక్తి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గడిచిన నాలుగేళ్ళలో రాష్ట్రంలో నిలిచిపోయిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, అధ్వానంగా మారిన రహదారులు, నిలిచి పోయిన సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా, క్రిస్‌మస్‌ కానుకలను పునఃప్రారంభించడం జరుగుతుందనే విషయాన్ని ప్రజలకు తెలిపాలన్నారు. అర్హులైన రైతులందరికీ రాయితీపై వ్యవసాయ యంత్రాలు, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం జరుగుతుందన్నారు. సంతమాగులూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు.

Updated Date - Feb 25 , 2024 | 11:34 PM

Advertising
Advertising