జగన్‌రెడ్డి మాయమాటలు నమ్మకండి
ABN, Publish Date - Feb 13 , 2024 | 01:14 AM
మాయ మా టలు, కళ్లబొల్లి కబుర్లు చెప్పే జగన్‌మోహన్‌రెడ్డి మాటలను నమ్మవద్దని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.
గిద్దలూరు టౌన్, ఫిబ్రవరి 12 : మాయ మా టలు, కళ్లబొల్లి కబుర్లు చెప్పే జగన్‌మోహన్‌రెడ్డి మాటలను నమ్మవద్దని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి రాచర్ల ఎస్సీపాలెంకు చెందిన 25 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. సోమవరం ఆరోగ్యం ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. వీరిని అశోక్‌రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గడి చిన నాలుగున్నర సంవత్సరంలో జగన్‌మోహ న్‌రెడ్డి ఎస్సీలకు తీవ్రంగా అన్యాయం చేశారని విమర్శించారు. ఎస్సీల సంక్షేమం కోసం టీడీపీ పార్టీ విశేషంగా కృషి చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని అన్నారు. టీడీపీ హయాంలో మీరందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేప ట్టిన ఘనత ఉందన్నారు. పార్టీలో చేరిన వారిలో చిట్టెం భాస్కర్, చిట్టెం సుబ్బయ్య, తలపాటి సుధాకర్, చిట్టెం పోలయ్య, చిట్టెం ప్రభాకర్, చిట్టెం కిరణ్, పుల్లయ్య, ఏసోబు, ప్రవీన్, చిట్టెం వెంకటయ్య, గుర్రం చంద్రశేఖర్, చిట్టెం చిన్న, చిట్టెం పిచ్చయ్య తదితరులు మాట్లాడుతూ అశోక్‌రెడ్డి గెలుపు కోసం తామంతా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షులు కటికె యోగానంద్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 13 , 2024 | 01:14 AM