ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కనిగిరిలో వైసీపీలో వర్గపోరు

ABN, Publish Date - Mar 11 , 2024 | 11:50 PM

నిగిరి వైసీపీలో వర్గపోరు రగులుతూనే ఉంది. పట్టణంలోని 7వ వార్డు కొత్తూరులో వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ విగ్రహాన్ని ప్రారంభించారు. ఆ వార్డు కౌన్సిలర్‌ తమ్మినేని సుజాత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఇన్‌చార్జి దద్దాల నారాయణకు ఆహ్వానం పలకడంతోపాటు శిలాఫలకంలో ఆయన పేరును కూడా వేశారు. వైసీపీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఆయన విగ్రహావిష్కరణకు రాకపోవడంతో వర్గపోరు మరోసారి బయటపడింది.

వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బుర్రా

కనిగిరి, మార్చి 11 : కనిగిరి వైసీపీలో వర్గపోరు రగులుతూనే ఉంది. పట్టణంలోని 7వ వార్డు కొత్తూరులో వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ విగ్రహాన్ని ప్రారంభించారు. ఆ వార్డు కౌన్సిలర్‌ తమ్మినేని సుజాత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఇన్‌చార్జి దద్దాల నారాయణకు ఆహ్వానం పలకడంతోపాటు శిలాఫలకంలో ఆయన పేరును కూడా వేశారు. వైసీపీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఆయన విగ్రహావిష్కరణకు రాకపోవడంతో వర్గపోరు మరోసారి బయటపడింది. అదేవిధంగా పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ వైఎం ప్రసాద్‌రెడ్డిని ఆహ్వానం పలికిన సమయంలో ఎన్నికల అనంతరం విగ్రహావిష్కరణ పెట్టుకోవాలని కౌన్సిలర్‌ సుజాతకు ఆయన సూచించినా, కార్యక్రమానికి మాత్రం హాజరుకాలేదు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గఫార్‌, ఏఎంసీ చైర్మన్‌ సాల్మన్‌రాజు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పులి శాంతి, సీఎ్‌సపురం ఎంపీపీ మూడమంచు, గంగసాని హుస్సేన్‌రెడ్డి, కౌన్సిలర్‌ వేల్పుల వెంకటేశ్వర్లు, దేవకి సత్యవతి, రామనబోయిన ప్రశాంతి, రామనబోయిన శ్రీనివాసులు, దేవరాజ్‌, రాజా, ఏడుకొండలు, కోఆప్షన్‌ చింతం శ్రీనివాసులు, రంగనాయకులరెడ్డి, బసిరెడ్డి పిచ్చిరెడ్డి, మరికొంతమంది ఎమ్మెల్యే అనుచరవర్గం హాజరుకాగా 13వ వార్డు కౌన్సిలర్‌ రిజ్వాన్‌బేగంతో పాటు మరో నలుగురు కౌన్సిలర్లు హాజరు కాలేదు.

ఎమ్మెల్యే నిష్క్రమణ అనంతరం హాజరైన జడ్పీటీసీ కస్తూరిరెడ్డి, గుంటక

ఎమ్మెల్యే బుర్రా వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి నిష్క్రమించి కందుకూరు వెళ్లిపోయినట్లు తెలుసుకున్న జడ్పీటీసీ కస్తూరిరెడ్డి, గుంటక తిరుపతిరెడ్డి వైఎస్సార్‌ విగ్రహం వద్దకు రావడం గమనార్హం. ఈ సంఘటనతో ఎమ్మెల్యే బుర్రాకు, ఇన్‌చార్జి దద్దాలకు మధ్య అంతర్గత పోరు బహిర్గతమైంది.

Updated Date - Mar 11 , 2024 | 11:50 PM

Advertising
Advertising